Home /News /sports /

WILL INDIA PLAY ICC CHAMPIONS TROPHY 2025 IN PAKISTAN WHAT IS ANURAG THAKUR REPLY JNK

Champions Trophy: పాకిస్తాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ... ఇండియా అక్కడకు వెళ్లి ఆడుతుందా? క్లారిటీ ఇచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్

పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా ఆడటంపై స్పోర్ట్స్ మినిస్టర్ ఏమన్నారంటే..!

పాకిస్తాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇండియా ఆడటంపై స్పోర్ట్స్ మినిస్టర్ ఏమన్నారంటే..!

Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీని పునరుద్దరించిన ఐసీసీ.. 2025 ఆతిథ్యపు హక్కులను పాకిస్తాన్‌కు కట్టబెట్టింది. అయితే రాజకీయ కారణాల వల్ల టీమ్ ఇండియాతో సహా పలు జట్లు పాకిస్తాన్‌లో పర్యటించడం లేదు. దీంతో ఇండియా అక్కడకు వెళ్తుందా? చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో జరుగుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఇంకా చదవండి ...
    ఐసీసీ (ICC) రాబోయే 8 ఏళ్లలో 2024 నుంచి 2031 వరకు జరగబోయే మెగా ఈవెంట్ల షెడ్యూల్, వేదికలను ప్రకటించింది. ఇందులో మూడు ఈవెంట్లకు బీసీసీఐ (BCCI) ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఇక 2024 టీ20 వరల్డ్ కప్‌ను వెస్టిండీస్ (West Indies)-యూఎస్ఏ (USA) క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ఐసీసీ మెగా ఈవెంట్‌ను అమెరికా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఇక నాలుగేళ్ల క్రితమే ఆపేసిన చాంపియన్స్ ట్రోఫీని (Champions trophy) ఐసీసీ తిరిగి పునరుద్దరించింది. 2025, 2029లో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నట్లు ఐసీసీ పేర్కొన్నది. అయితే 2025 టోర్నీకి పాకిస్తాన్, 2029 టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా సాధ్యమేనా అని క్రికెట్ ఫ్యాన్స్ (Cricket Fans) కూడా అనుమానపడుతున్నారు.

    పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తీవ్రవాదం నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్లను ఆ దేశానికి కేటాయించడం లేదు. 2009లో శ్రీలంక జట్టు పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు లాహోర్‌లో పర్యటక జట్టు బస్సుపై దాడి జరిగింది. అప్పటి నుంచి వేరే దేశాలు అక్కడ పర్యటించడానికి భయపడుతున్నాయి. చివరి సారిగా 1996లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్‌తో కలసి సంయుక్తంగా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్‌లో మరే మెగా ఈవెంట్ జరగలేదు. శ్రీలంక జట్టుపై దాడి తర్వాత కనీసం ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణ కూడా కష్టం కావడంతో యూఏఈలోని అబుదాబిని పాకిస్తాన్ హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకుంటున్నది.

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వదిలేసిన ట్రెంట్ బౌల్ట్.. ఎందుకు వదిలేశాడో సెటైర్ వేసిన స్కై



     షెడ్యూల్ ప్రకారం 2020లో జరగాల్సిన ఆసియా కప్‌కు కూడా పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నది. అయితే కరోనా కారణంతో పాటు ఇండియా ఆ దేశంలో పర్యటించడానికి విముఖత చూపించింది. రాజకీయ కారణాల వల్ల పాకిస్తాన్ రాలేమని చెప్పింది. దీంతో వచ్చే ఏడాది శ్రీలంక వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో ఆసియా కప్ నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. మరి 2025 చాంపియన్స్ ట్రోఫీ పరిస్థితి ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. అప్పటికల్లా పరిస్థితి చక్కబడుతుందా అని అంటున్నారు.

    Ind Vs Nz : రాంచీలో ఆటగాళ్ల కోసం ప్రత్యేక వంటకాలు.. ఫుడ్ మెనూలోని ఆహార పదార్ధాలు ఇవే ..!






    ఈ విషయంపై తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్తాన్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పాల్గొంటుందా అని అందరూ అడుగుతున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయ కారణాల వల్ల భారత జట్టు ఆ దేశంలో పాల్గొనడం లేదు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. ఈ విషయంలో బీసీసీఐ, క్రీడా శాఖ చేసేది ఏమీ లేదు అని ఠాకూర్ అన్నారు. మరోవైపు కేవలం టీమ్ ఇండియానే కాదు ఇతర దేశాలు కూడా పాకిస్తాన్‌లో పర్యటించడానికి సిద్దంగా లేవు. ఇటీవలే న్యూజీలాండ్, ఇంగ్లాండ్ జట్లు తమ పర్యటనలను రద్దు చేసుకున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ రావడానికి ఇతర జట్లు నిరాకరిస్తే యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ ప్రయత్నాలు చేస్తుందని క్రికెట విశ్లేషకులు భావిస్తున్నారు.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, ICC, India VS Pakistan, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు