సింగ్‌రాజ్ అదాన (Singhraj Adana).. మొదటి నుంచి అతడి జీవితం ఒక పోరాటం. చిన్నప్పుడే పోలియో కారణంగా కాళ్లు సరిగా పని చేయక పోయినా.. జీవితంలో ఏదో సాధించాలనే పట్టుదల అతడిని నడిపించింది. మూడు నెలల క్రితం చావు అంచుల వరకు వెళ్లిన అతడు.. నేడు టోక్యో (Tokyo) వేదికగా రెండు పతకాలు గెలిచాడు. అతడే పారా షూటర్ సింగ్‌రాజ్ అదాన. టోక్యో పారాలింపిక్స్ 2020లో (Paralympics) సింగ్‌రాజ్ అదాన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ (ఎస్‌హెచ్1 కేటగిరీ)లో కాంస్య పతకం, పురుషుల 50 మీటర్ల ఎయిర్‌పిస్టల్ (ఎస్‌హెచ్1 కేటిగిరి)లో రజత పతకం సాధించాడు. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి అతడు రికార్డు సృష్టించాడు. అవని లేఖర కూడా ఈ ఏడాది రెండు పతకాలు సాధించింది. అయితే అదానాకు ఈ రెండు పతకాలు అంత సులభంగా ఏమీ రాలేదు.
సరిగ్గా మూడు నెలల క్రితం (మే లో) అదాన కోవిడ్ (Covid 19) బారిన పడ్డాడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అదాన కోవిడ్ నుంచి కోలుకోవడానికి భారీగా ఖర్చు చేశాడు. అదాన చావు అంచుల వరకు వెళ్లి కోవిడ్ నుంచి కోలుకొని ఇంటికి వచ్చాడు. గత ఏడాది కోవిడ్ ప్రభావం కారణంగా అనేక మంది అథ్లెట్లు శిక్షణకు సరిగా హాజరుకాలేక పోయారు. ఇక పోలియోతో సింగ్‌రాజ్ అదానా కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేక శిక్షణకు దూరమయ్యాడు. చాన్నాళ్లుగా పారాలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో ఉన్న అదానాకు షూటింగ్ రేంజ్‌కు వెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో చాలా కుంగిపోయాడు. అయితే అతడి కోచ్‌లు అదానాకు ఒక సలహా ఇచ్చారు. ఇంటి దగ్గరే ఒక షూటింగ్ రేంజ్‌ను నిర్మించుకుంటే ఎప్పుడంటే అప్పుడు ప్రాక్టీస్ చెయ్యవచ్చని చెప్పారు. ఆ సలహా సింగ్‌రాజ్‌కు కూడా నచ్చింది. అయితే షూటింగ్ రేంజ్ నిర్మించడం వాళ్ల తాహతుకు మించిన వ్యవహారం. కోచ్‌ల సలహాను తల్లిదండ్రులకు చెప్పాడు. నిత్యావసరాలకే ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ రేంజ్ కోసం డబ్బు ఇవ్వడం కష్టమని వాళ్లు చెప్పారు. కానీ అతడి లక్ష్యాన్ని చేరుకోవడానికి కాస్త సహాయం చేస్తామన్నారు. ఇక భార్య కూడా తన నగలు అమ్మి డబ్బులు ఇచ్చింది. అంతే కాకుండా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా, ఎన్ఆర్ఏఐ కూడా అతడికి సహాయం చేసింది.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు స్టార్ ప్లేయర్ అనుమానమే.. అదే జరిగితే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు
కేవలం టోక్యో పారాలింపిక్స్ కోసమే కాకుండా.. పారీస్ పారాలింపిక్స్ కోసం కూడ ఉపయోగపడేలా అంతర్జాతీయ స్థాయి షూటింగ్ రేంజ్‌ను అదాన తన ఇంటి సమీపంలో నిర్మించాడు. స్వయంగా ఆ షూటింగ్ రేంజ్‌ను అదానానే డిజైన్ చేసుకొని నిర్మించుకున్నాడు. ఒకే రాత్రిలో డిజైన్ చేసుకున్నాడంటే.. అదానా పట్టుదల ఏంటో అర్దం చేసుకోవచ్చు. ఇకపై అత్యవసర సమయాల్లో అక్కడే షూటింగ్ ప్రాక్టీస్ చేసేలా ఆ రేంజ్ సిద్దమయ్యింది. అలా సింగ్‌రాజ్ ఎన్నో అష్టకష్టాలు పడి టోక్యో పారాలింపిక్స్‌కు సిద్దపడ్డాడు. అతడిపై భార్య, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్మ చేయకుండా ఏకంగా ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గాడు.
తాను కనుక కోవిడ్ బారిన పడకుండా ఉంటే తప్పకుండా స్వర్ణం సాధించి ఉండేవాడినని.. కోవిడ్ తాలూకు కాంప్లికేషన్స్ ఇంకా తనని వెంటాడుతున్నాయని సింగ్‌రాజ్ అదాన చెప్పాడు. ఏదేమైనా అదాన తాను అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా చేరుకున్నాడు. పారీస్ పారాలింపిక్స్‌లో తప్పకుండా స్వర్ణం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Maria Sharapova: వెనీస్ బీచ్‌లో బికినీతో మారియా షరపోవా సందడి.. కాబోయే భర్తతో కలసి షికార్లు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Shooting, Tokyo Olympics