WI VS SA UNIVERSAL BOSS CHRIS GAYLE STUNS ALL WITH A CARTWHEEL CELEBRATION WATCH VIRAL VIDEO SRD
Viral Video : " గేల్..జిగేల్" .. వికెట్ తీసిన ఆనందంలో బంగీ జంప్స్ చేసిన యూనివర్శల్ బాస్..
Photo Credit : Twitter
Viral Video : అప్పుడప్పుడూ క్రికెట్లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాగే, కొందరు ప్లేయర్లు ఫన్నీ గా ప్రవర్తిస్తూ నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్.
అప్పుడప్పుడూ క్రికెట్లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాగే, కొందరు ప్లేయర్లు ఫన్నీ గా ప్రవర్తిస్తూ నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటాడు యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్. ఈ సిక్సర్ల వీరుడు ఏది చేసినా ఫన్నీగానే ఉంటుంది. బ్యాటింగ్‌కు దిగితే భారీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడే గేల్ మైదానంలో.. తన చర్యలతో ఆకట్టుకుంటాడు. లేటెస్ట్ గా దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో గేల్ వికెట్ తీశానన్న ఆనందంలో బంగీ జంప్స్ చేయడం వైరల్‌గా మారింది. బ్యాటింగ్‌లో ఐదు పరుగులు మాత్రమే చేసిన గేల్ ఫీల్డింగ్, బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. కెప్టెన్ పొలార్డ్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్‌నే గేల్ చేత వేయించాడు. అయితే, గేల్ తాను వేసిన ఓవర్ తొలి బంతికే డేంజరస్ ప్లేయర్ రీజా హెండ్రిక్స్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. తన వ్యూహం ఫలించన్న ఆనందంలో హెండ్రిక్స్ పెవిలియన్ వెళ్లే సమయంలో గేల్ బంగీ జంప్స్ చేశాడు.
ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. గేల్ తీరుపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు.''41 ఏళ్ల వయసులో గేల్ ఇలాంటి పనులు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడితే.. గేల్‌కు వయసుతో సంబంధం లేదని.. అతని ఫిట్నెస్ అమోఘం'' అంటూ మరొకొందరు పేర్కొన్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్ పొలార్డ్ (25 బంతుల్లోనే 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించగా.. లెండిన్ సిమన్స్ 47 పరుగులుతో రాణించాడు.
ఆ తర్వాత 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. క్వింటన్ డికాక్ 60 పరుగులతో ఆకట్టుకోగా.. మిగతావారు ఎవరు చెప్పుకోదగ్గ స్కోరుగా చేయలేకపోయారు. అయితే, నిర్ణయాత్మకమైన చివరి టీ20 శనివారం జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయినా విండీస్.. టీ -20 సిరీస్ ను కైవసం చేసుకోని పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.