మోస్ట్ రిచెస్ట్ స్పోర్ట్స్‌లో టెన్నిస్ (Tennis) టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ గేమ్‌లో నిర్వహించే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (Wimbledon), యూఎస్ ఓపెన్ (US Open) అనే 4 వేర్వేరు టోర్నమెంట్లు అభిమానులను బాగా అలరిస్తుంటాయి. అయితే ఏ టోర్నమెంట్‌కి లేని ప్రాముఖ్యత వింబుల్డన్ (Wimbledon) టోర్నమెంట్‌కి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది వింబుల్డన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. టెన్నిస్ స్టార్లందరూ అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. అయితే వింబుల్డన్ టోర్నమెంట్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ టోర్నీ అతిపెద్ద టెన్నిస్ టోర్నమెంట్‌లలో ఒకటిగా నిలవడంతో పాటు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఈ టోర్నమెంట్ కోసం టెన్నిస్ ప్లేయర్లందరూ ఒక స్పెషల్ డ్రెస్ కోడ్‌లో కనిపిస్తారు. అదే వైట్ కలర్ (White Color) లేదా తెలుపు రంగు.
లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్, రాకెట్ క్లబ్‌లో ఈ వింబుల్డన్ జరుగుతోంది. ఈ టోర్నీలో రాఫెల్ నాదల్ వంటి టాప్ టెన్నిస్ స్టార్లు సైతం వైట్ కలర్ డ్రెస్ మాత్రమే ధరిస్తారు. మొత్తం తెలుపు రంగు దుస్తులనే క్రీడాకారులు ధరించాలనే రూల్ ఉండటం వల్ల వింబుల్డన్ ఇతర వాటికి భిన్నంగా నిలుస్తుంది. ఈ రూల్ విక్టోరియన్ కాలంలోనే ఉంది. అప్పట్లో ఆటగాళ్లు తెలుపు తక్కువ చెమటను చూపుతుందని నమ్మేవారు. అందుకే తెల్లని దుస్తులు ధరించడానికి ఇష్టపడేవారు. అయితే వింబుల్డన్ టెన్నిస్ ఆటగాళ్లకు పెట్టిన మొదటి రూల్ ఏంటంటే.. వారు దాదాపు పూర్తిగా తెల్లగా ఉండే డ్రెస్ ధరించాలి అని చెప్పడమే! ఆటగాళ్లు కోర్టులోకి అడుగుపెట్టినప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. 19వ శతాబ్దంలో అమల్లోకి వచ్చింది ఈ వింబుల్డన్ డ్రెస్ కోడ్. ఆ కాలంలో ఈ నియమాలను మరింత కఠినంగా ఉండేవి.
ఆఫ్-వైట్ షేడ్స్, క్రీమ్ కలర్, లోగోలు, ప్యాటర్న్‌లలో ఉండే రంగులు గల దుస్తులు ధరించినా సరే ఆ ప్లేయర్లను కోర్టు లోపలికి అనుమతించరు. నాన్-వైట్ ట్రిమ్ ని కొంత పాప్ కలర్‌తో ధరిస్తే అభ్యంతరం తెలపరు. అయితే అది కూడా ప్యాంటు, స్కర్ట్ లేదా షార్ట్ లెగ్, నెక్‌లైన్, స్లీవ్ కఫ్ లేదా బయట సీమ్‌పై ఉండాలి. అలానే ఒక సెంటీమీటర్ వెడల్పులో మాత్రమే ఉండాలి. ఇక క్యాప్‌లు, హెడ్‌బ్యాండ్‌లు, బండెనాస్, రిస్ట్‌బ్యాండ్‌లు, సాక్స్‌లు వంటి ఇతర వస్తువులు కూడా తెలుపు రంగులోనే ఉండాలి. అయితే ఒక సెంటీమీటర్ ట్రిమ్‌ని అనుమతిస్తారు. ప్లేయర్ల బూట్లు కూడా పూర్తిగా తెల్లగా ఉండాలి, బూట్ల కింద భాగం కూడా తెలుపు రంగులోనే ఉండాలి. ఈ రూల్ ఎంత కఠినంగా ఉంటుందంటే... ఆట సమయంలో కనిపించే లోదుస్తులు కూడా తెలుపు రంగు థీమ్‌తో సరిపోలాలట. అయినా కూడా డ్రెస్ కోడ్‌ని కొందరు ఆటగాళ్లు ఉల్లంఘించిన సందర్భాలున్నాయి.
ఇటీవలే 2022 వింబుల్డన్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో, లాట్వియన్ అథ్లెట్ జెలెనా ఒస్టాపెంకో తెల్లటి టాప్‌ని, క్రీమ్-కలర్ స్కర్ట్‌ని ధరించింది. ఇది రూల్ ఉల్లంఘించినట్లే. 2017లో వీనస్ విలియమ్స్ ఆల్-వైట్ టోర్నమెంట్‌లో పింక్ స్ట్రాప్స్ కనిపించినప్పుడు మ్యాచ్ మధ్యలో తన బ్రాను మార్చుకోమని కూడా అడిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.