వరల్డ్ కప్‌ కోసం టీంఇండియాలో ఎవరు ఉండాలంటే... వివీఎస్ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ ఎనాలసిస్

ICC World Cup 2019 : ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎవరెవరు ఉండాలో వెటెరన్ క్రికెటర్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. వారిలో ఒకడైన వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 6:55 PM IST
వరల్డ్ కప్‌ కోసం టీంఇండియాలో ఎవరు ఉండాలంటే... వివీఎస్ లక్ష్మణ్ ఇంట్రెస్టింగ్ ఎనాలసిస్
వీవీఎస్ లక్ష్మణ్
  • Share this:
ప్రపంచ కప్ కోసం రెడీ అవుతున్న టీంఇండియాలో యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్ అవసరం లేదంటున్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. పంత్ బదులు ధోనీ లేదా దినేష్ కార్తీక్‌ని ఎంచుకోమంటున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో పంత్ గుడ్ ఫామ్‌లో లేడంటున్న లక్ష్మణ్... లాస్ట్ ఫైవ్ ఇన్నింగ్స్‌లో పంత్... 4, 40 not out, 28, 3... 1 మాత్రమే చేయగలిగాడని తెలిపాడు. ప్రపంచకప్ టోర్నమెంట్ అనేది అత్యంత ముఖ్యమైనదన్న లక్ష్మణ్... ఎక్స్‌పీరియన్స్‌ని బట్టీ కార్తీక్‌ని సెలెక్టర్లు ఎంపిక చెయ్యాలని కోరుతున్నాడు. ఇంతకు ముందు టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇలాంటి అభిప్రాయమే చెప్పాడు. పంత్ మరింత రాటుదేలాలని అన్నాడు.

రిషబ్ పంత్ ఫిట్ అవ్వాలి. ఇంత తక్కువ టైంలో తను ఫిట్ అవ్వగలడా అన్నది నాకు తెలియదు. అది అతనిపై ఆధారపడి ఉంటుంది. తను భవిష్యత్ ప్లేయర్ అవ్వడం ఖాయం. కార్తీక్ భారత వన్డే జట్టులో లేడు కాబట్టి, తనను ఆప్షన్‌గా ఎంచుకునే అంశంపై ఆలోచించట్లేదు. అంతా సెలెక్టర్లు ఏం కోరుకుంటున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది.
గంగూలీ


బౌలింగ్ విభాగాన్ని బట్టీ చూస్తే, నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లు అంటే యజ్వేంద్ర చాహల్, కులదీప్ యాదవ్‌ ఉండాలన్నది లక్ష్మణ్ మాట. ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ ఉండటం కామనే అన్న లక్ష్మణ్... ఖలీల్ అహ్మద్‌ని కూడా తీసుకోవడం సర్‌ప్రైజ్ అన్నాడు.

లక్ష్మణ్ చెబుతున్న టీంఇండియా : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, కులదీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, కే ఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ 

ఇవి కూడా చదవండి :

ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్
Loading...
యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి
First published: March 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...