హోమ్ /వార్తలు /క్రీడలు /

Taliban Ban Chess: అఫ్గానిస్తాన్‌లో చెస్ బ్యాన్ చేయబోతున్న తాలిబన్లు? ఎందుకో తెలుసా?

Taliban Ban Chess: అఫ్గానిస్తాన్‌లో చెస్ బ్యాన్ చేయబోతున్న తాలిబన్లు? ఎందుకో తెలుసా?

చెస్ ఆటంటే తాలిబన్లకు ఎందుకంత విద్వేషం..? (ప్రతీకాత్మక చిత్రం)

చెస్ ఆటంటే తాలిబన్లకు ఎందుకంత విద్వేషం..? (ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చెస్ ఆటను తాలిబన్లు నిషేధించే ప్రయత్నం చేస్తున్నారు. తమ దేశంలో చెస్‌ను నిషేధించే అవకాశం ఉందని పలువురు చెస్ ప్లేయర్లు ఆందోళన చెందుతున్నారు.

అఫ్గానిస్తాన్‌ను (Afghanistan) తాలిబన్లు (Taliban) ఆక్రమించుకున్న దగ్గరి నుంచి రోజుకో వార్త బయటకు వస్తున్నది. అన్ని దేశాల లాగానే అఫ్గాన్ నుంచి ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నారు. ఆ దేశానికి చెందిన క్రికెటర్లకు ఇతర దేశాల లీగ్స్‌లో చాలా డిమాండ్ ఉన్నది. తాలిబన్లు వచ్చిన తర్వాత క్రికెట్ పరిస్థితి ఏమవుతుందో అని అందరూ భావించారు. కానీ తాలిబన్లు అనూహ్యంగా క్రికెట్‌కు (Taliban Supports Cricket) మద్దతు పలికారు. దీంతో ఇతర క్రీడాకారులు కూడా తమకు కూడా తాలిబన్ల మద్దతు ఉంటుందని సంబరపడ్డారు. అయితే తాలిబన్లు చెస్‌పై (Chess) మాత్రం తీవ్ర వ్యతిరేకత చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఆ ఆటను అఫ్గాన్‌లో బ్యాన్ (Ban) చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరల్డ్ ఛెస్ ఫెడరేషన్ (FIDE) ప్రతినిధి ఒకరు అఫ్గాన్ చెస్ ప్లేయర్‌కు కాల్ చేశారు. దేశంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్నాయని.. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ప్రజలు బతుకుతున్నారని సదరు చెస్ ప్లేయర్ చెప్పాడు. కొత్త ప్రభుత్వం చెస్ ఆడటానికి అంగీకరించే పరిస్థితులు లేవని అతడు చెప్పాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో వరల్డ్ చెప్ ఫెడరేషన్ గుర్తించిన 64 మంది ప్లేయర్లు ఉన్నారు.

గతంలో తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలో కూడా చెస్‌పై ఉక్కుపాదం మోపారు. చెస్ ఒక గ్యాంబ్లింగ్ లాంటిదని.. అది ప్రజల మనస్సును చెడగొట్టి.. దేవును ప్రార్థనల నుంచి దూరం చేస్తుందని తాలిబన్లు నమ్ముతున్నారు. గతంలో కాబూల్‌కు చెందిన వ్యాపారవేత్త అయిన హాజీ షిరుల్లాను తాలిబన్లు తన ఇంటిలోనే చుట్టు ముట్టారు. ఆ సమయంలో అతడు తన సోదరుడితో కలసి చెస్ ఆడుతున్నాడు. వెంటనే ఆ చెస్ బోర్డును ముక్కలు ముక్కలుగా విరిచేడమే కాకుండా వారిద్దరినీ తీసుకెళ్లి రెండు రోజుల పాటు జైల్లో పడేసినట్లు ఒక నివేదికలో పేర్కొన్నారు. చెస్ వల్ల ప్రజలు సాతాను బిడ్డలుగా మారిపోతారని.. వాళ్లు దేవుడి నుంచి దూరమైపోతారని తాలిబన్లు విశ్వసిస్తున్నారు. అందుకే ముందు నుంచి వారికి ఆ ఆటపై తీవ్రమైన ద్వేషం ఉన్నది. దీంతో గత పాలనలో తాలిబన్లు చెస్‌ను పూర్తిగా నిషేధించారు.

Sourav Ganguly Salary: సౌరవ్ గంగూలీ, జై షాకు బీసీసీఐ ఎంత వేతనం చెల్లిస్తున్నది? గంగూలీ సంపాదన ఎంత?

తాలిబన్లు కేవలం చెస్‌ను మాత్రమే కాకుండా సంతోషపరిచే సంగీతం, పూల్ గేమ్స్, మాస్కులు, టేపులు, కంప్యూటర్లు, టీవీలు, ఆల్కహాల్, సెక్స్ వైపు ప్రేరేపించే సంగీతం, వైన్, నెయిల్ పాలిష్, విగ్రహాలు, బాణసంచా, క్రిస్మస్ కార్డులు అంటే మొదటి నుంచి విద్వేషం పెంచుకున్నారు. వాటిని అఫ్గానిస్తాన్‌లో గతంలోనే నిషేధించాలని నియమం పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారం రావడంతో తాను నిషేధించాలనుకున్న అన్నింటిపై బ్యాన్ వేయడానికి సిద్దపడుతున్నారు. కాగా, చెస్‌ను గ్యాంబ్లింగ్‌ అని తాలిబన్లు అనడంపై వరల్డ్ చెస్ ఫెడరేషన్ తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నది. అది మనిషి తెలివి తేటలను వెలికితీసే మంచి గేమ్ గానే చూడాలి కానీ.. గ్యాంబ్లింగ్ అని అనవద్దని అభ్యర్థిస్తున్నది. మరి తాలిబన్లు చెస్‌పై తమ నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాల్సిందే.

First published:

Tags: Games, Sports, Taliban

ఉత్తమ కథలు