పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. తాము జీవితంలో సాధించాలని కోరుకొని విఫలమైనది.. తమ పిల్లలు సాధించాలని అనుకుంటుంటారు. ఇది అందరి ఇళ్లలో ఉండే సాధారణమైన విషయమే. పొరపాటును.. తమ పిల్లలు తమ లక్ష్యం నుంచి పక్కకు వెళ్తున్నారని భావిస్తే తల్లిదండ్రులు కోపం తెచ్చుకుంటారు. చదువుల్లో వెనుకబడినా.. ర్యాంకులు తగ్గిన ఇక వారి కోపం మామూలుగా ఉండదు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. హర్యాణాలో జిల్లా స్థాయి క్రీడాకారిణి అయిన సైనా (Saina Nehwal) తల్లి ఉషా నెహ్వాల్ (Usha Nehwal) తన కూతురిని బ్యాడ్మింటన్ స్టార్‌గా చూడాలని అనుకున్నారు. సైనా చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చిన వారి కుటుంబం వెంటనే ఎల్బీస్టేడియంలోని సాయ్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారు. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌లో అసాధారణ ప్రతిభ కనపర్చిన సైనా.. 8 ఏళ్ల వయసులోనే అండర్ 10, అండర్ 13 రాష్ట్ర స్థాయి పతకాలను సాధించింది. వరుస విజయాలతో దూసుకొని పోతున్న సైనా నెహ్వాల్ జాతీయ సబ్-జూనియర్స్ చాంపియన్‌షిఫ్ ఫైనల్లో ఓడిపోయింది. దీంతో సైనా వాళ్ల అమ్మ ఉషా నెహ్వాల్ కోపం కట్టలు తెచ్చుకొని.. అక్కడే చెంప చెల్లుమనిపిస్తుంది. కాగా, తన కూతురిని విజేతగానే చూడాలనుకున్న ఉషా.. ఆక్షణంలో ఓటమిని జీర్ణించుకోలేక చెంపమీద కొట్టింది. ఈ విషయాన్ని ఇటీవల విడుదలైన సైనా సినిమాలు చూపించారు.
కాగా, సైనా నెహ్వాల్‌ను ఆ రోజు ఫైనల్లో ఓడించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ అదితి ముతత్కర్. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పుట్టిన అదితి పెరిగింది మహారాష్ట్రలోని పూణేలో. ఆమె జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రాణించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఆసియన్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతాకం కూడా గెలుచుకున్నది. అయితే సైనాతో పాటు పలు జాతీయ పోటీల్లో పాల్గొన్న అదితి గాయాల కారణంగా పెద్దగా రాణించలేక పోయింది. 2009 ఇండియా గ్రాండ్ ప్రీ ఫైనల్‌కు చేరుకున్న అదితి.. సైనా చేతిలోనే ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నది. అండర్ 13, అండర్ 16, అండర్ 19, సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. ఇలా గెలిచిన మూడో మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ అదితి మాత్రమే.
సైనా సినిమా విడుదలైన తర్వాత అదితి స్నేహితురాలు ఒకామె సినిమా చూసి.. 'నీ వల్ల సైనాకు చెంప దెబ్బ పడింది..చూశావా' అని కాల్ చేసిందట. దీంతో అదితి భయం భయంగా అమెజాన్ ప్రైమ్‌లో సైనా సినిమా చూసిందట. జాతీయ సబ్-జూనియర్స్‌లో సైనా ఓడిపోయిన సీన్లో తన పేరును ఉపయోగించడం అదితి చూసింది. కాగా, ఈ సినిమాకు ముందు తనను ఎవరూ సంప్రదించలేదని అదితి పేర్కొన్నది. అయితే తనను నెగెటివ్‌గా ఏమీ చూపించలేదు కాబట్టి తనకు కూడా ఏమీ ప్రాబ్లెం లేదని అదితి అంటున్నది. అయితే నాతో ఓటమే.. ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని చూపించారు. చాలా నచ్చిందని అదితి చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Saina Nehwal