హోమ్ /వార్తలు /క్రీడలు /

Rohit Sharma: టీ20 తదుపరి కెప్టెన్​గా రోహిత్ శర్మ?.. రోహిత్​కు కలిసొచ్చే అంశాలివే..​

Rohit Sharma: టీ20 తదుపరి కెప్టెన్​గా రోహిత్ శర్మ?.. రోహిత్​కు కలిసొచ్చే అంశాలివే..​

రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)

రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)

టీమిండియా సారథి విరాట్​ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్​, నవంబర్​ మధ్య యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్​ ముగిసిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

టీమిండియా సారథి విరాట్​ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్​, నవంబర్​ మధ్య యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్​(T20 World Cup) ముగిసిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పనిభారం కారణంగా ఇక తాను కెప్టెన్సీగా కొనసాగలేనని నిన్న విరాట్​ కొహ్లీ(Virat Kohli)సోషల్​ మీడియా వేదికగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లి కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకోవడం ఖాయమైపోయింది. అయితే తదుపరి కెప్టెన్​గా ఎవరు ఉంటారు? అనే చర్చ క్రికెట్​ అభిమానుల్లో మొదలైంది. ప్రస్తుతం వైస్​ కెప్టెన్​గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోహిత్​ శర్మకే(Rohit Sharma)టీమిండియా పగ్గాలు దక్కనున్నాయని ఊహాగానాలు జోరందుకున్నాయి.

చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్​ రోహిత్​ శర్మను కెప్టెన్​గా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్​ చేస్తున్నారు. ఎందుకంటే, రోహిత్​ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. అంతేకాదు ఈ హిట్​మ్యాన్​​ మంచి ఆటతీరుతో ఫామ్​లో ఉన్నాడు. రోహిత్​కు గనుక కెప్టెన్సీ ఇస్తే టీమిండియా(Team India) మరిన్ని విజయాలు సాధించగలదని చెబుతున్నారు.

T-20 World Cup : టీ -20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, గ్రూప్ ల వివరాలన్నీ మీ కోసం...


ఐపీఎల్​లో​ ముంబై ఇండియన్స్​కు( Mumbai Indians) కెప్టెన్సీగా వ్యవహరిస్తున్న రోహిత్​.. ఇప్పటివరకు ముంబై జట్టుకు ఏకంగా 5 టైటిల్స్​ అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020 లో ముంబై ఇండియన్స్ (MI)కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఇది రోహిత్​కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. మరోవైపు కొహ్లీ కెప్టెన్సీగా ఉన్న రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు మాత్రం ఇప్పటివరకు ఒక్క టైటిల్​ను కూడా కైవసం చేసుకోకపోవడం గమనార్హం. దీంతో కొహ్లీ కెప్టెన్సీగా తప్పుకోవాలని క్రికెట్​ ఫ్యాన్స్​ నుంచి అనేక డిమాండ్లు వినిపించాయి.

Virat Kohli: కెప్టెన్‌గా విరాట్ కొహ్లి సక్సెస్ అయ్యాడా ? ఫెయిల్ అయ్యాడా ?.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..

అయితే ఐపీఎల్​ను పక్కన పెడితే ఇతర ఫార్మాట్లలో మాత్రంకొహ్లీ కెప్టెన్​గా మంచి విజయాలనే సాధించాడు. అతడు కెప్టెన్​గా వ్యవహరించిన 45 మ్యాచ్‌ల్లో 27 విజయాలు దక్కాయి. అంతేకాదు, బ్యాటింగ్​లోనూ ఉత్తమంగా రాణించాడు. మరోవైపు, రోహిత్​ శర్మపై కూడా కెప్టెన్సీలో మంచి రికార్టే ఉంది. రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో వరుసగా నాలుగు విజయాలతో తన కెప్టెన్సీ కెరీర్‌ని ప్రారంభించాడు.

* ఐపీఎల్​లో రోహిత్​కు మంచి రికార్డు..

వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్ట్​ కప్​కి మాత్రం విరాట్ కొహ్లీనే నాయకత్వం వహించనున్నాడు. ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. అతను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే ముందు ఖచ్చితంగా ట్రోఫీని దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఏదేమైనా, కొహ్లీ వన్డే, టెస్టుల్లో ఫార్మాట్లకు కెప్టెన్​గానే కొనసాగనున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే పనిభారం తగ్గుతుందని.. దీంతో తన బ్యాటింగ్​పై మరింత ఫోకస్​ పెట్టొచ్చని భావిస్తున్నాడు.

First published:

Tags: Cricket, Rohit sharma, T20, Virat kohli

ఉత్తమ కథలు