WHY RAHUL DRAVID IS SPECIAL AS A COACH SOURAV GANGULY TOLD AN INTERESTING STORY JNK
Coach Rahul Dravid: కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి అద్భుతమైన విషయం చెప్పిన గంగూలీ.. అతడు ఎంత ప్రత్యేకం అంటే..
ద్రవిడ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన సౌరవ్ గంగూలీ (PC: BCCI)
Coach Rahul Dravid: టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి సౌరవ్ గంగూలీ తొలి సారిగా నోరు విప్పాడు. అతడు ఎంత ప్రత్యేకమైన వ్యక్తో చెప్పుకొచ్చాడు. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ సమయంలో అతడు ఎలా వ్యవహరించాడో వివరించాడు.
టీమ్ ఇండియాలో (Team India) ఇప్పుడు అన్నీ భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ముగిసిన తర్వాత భారత జట్టులో సమూల మార్పులకు బీసీసీఐ (BCCI) తెరతీసింది. టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను (Rahul Dravid) నియమించారు. ఇక వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను (Rohit Sharma) ఎంపిక చేశారు. టెస్టు క్రికెట్‌కు మాత్రం విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో భారత జట్టు భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ప్రతీ క్రికెట్ ఫ్యాన్‌కు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సౌరవ్ గంగూలీతో 'క్రికెట్ నెక్ట్స్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం టీమ్ ఇండియాకు సమర్దుడైన కోచ్, కెప్టెన్లు ఉన్నారని.. గత ఐదేళ్లలో భారత జట్టు ఎలాంటి విజయాలను అందుకున్నదో.. అంతకు మించిన మంచి భవిష్యత్ జట్టుకు లభిస్తాయని గంగూలీ వ్యాఖ్యానించాడు. భారత జట్టు భవిష్యత్ ఉజ్వలంగా ఉండబోతున్నదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పుకొచ్చాడు.
సౌరవ్ గంగూలీ ఈ ఇంటర్వ్యూలో రాహుల్ ద్రవిడ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలిపాడు. అతడు ఒక ప్రత్యేకమైన కోచ్ అని గంగూలీ అన్నాడు. రాహుల్ ద్రవిడ్ కాన్పూర్ టెస్టు సమయంలో చేసిన ఒక విషయం గురించి గంగూలీ గుర్తు చేశాడు. "కాన్పూర్ టెస్టుకు ముందు జట్టు ప్రాక్టీస్ సెషన్ తర్వాత ద్రవిడ్ స్వయంగా వికెట్లు తీసుకొని రావడం, ప్రాక్టీస్ కోసం ఉపయోగించిన బంతులు మరియు ఇతర అన్ని వస్తువులను తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకొని రావడం వంటి పనులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ ఇలా చేయడం కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లకు గొప్ప దృశ్యం. కానీ నాకు ద్రవిడ్ చాలా కాలంగా తెలుసు. అతను ఎప్పుడూ ఇలాగే ఉండేవాడు. ఆటకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చూసుకుంటాడు' అని గంగూలీ చెప్పాడు.
గతంలో కూడా ద్రవిడ్ అసలు కోచ్ ఎలా అయ్యాడన్న విషయాన్ని గంగూలీ వివరించాడు. “ఐపీఎల్ సమయంలో మాత్రమే టీమ్ ఇండియా కోచ్‌కు ఒక రెండు నెలల పాటు ఇంట్లో గడిపే అవకాశం లభిస్తుంది. చాలా కాలం పాటు ఇంటికి దూరంగా ఉండాలనే ఆలోచనతో ద్రవిడ్ ఈ బాధ్యతను నిర్వహించడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే భారత జట్టుతో అతను 8 నుండి 10 నెలల పాటు ఇంటి నుండి బయట ఉండవలసి వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న ద్రవిడ్ ఈ విషయంలో కోచ్ పదవిని తిరస్కరించాడు' అని గంగూలీ చెప్పాడు.
జాతీయ క్రికెట్ అకాడమీకి చీఫ్‌గా రాహుల్ ద్రవిడ్ పని చేశాడు. అదే పదవిని కొనసాగించాలని ద్రవిడ్ అనుకున్నాడు. కానీ మేమే అతడిని పలు మార్లు సంప్రదించి కోచ్ పదవి కోసం ఒప్పించాము. రవిశాస్త్రి నిష్క్రమణ తర్వాత రాహుల్ ద్రవిడ్ కంటే మెరగైన కోచ్‌ను మేము తేలేము అనిపించింది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్ కాకముందు రాహుల్ ద్రవిడ్ ఇండియా-ఎ, అండర్-19 జట్టుకు 4 సంవత్సరాలు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. అతని కోచింగ్‌లో చాలా మంది ఇండియా-ఎ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. జూనియర్ జట్టు కూడా అద్భుత ప్రదర్శన చేసి 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.