Moeen Ali: ఇండియాతో మ్యాచ్ రద్దు కావడంతో మొయిన్ అలీ నిరాశ చెందాడా? అందుకే రిటైర్మెంట్ నిర్ణయం?

ఆ మ్యాచ్ రద్దుతో మొయిన్ అలీ నిరాశ చెందాడా? (PC: ICC)

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవడానికి కారణం ఏమిటి? ఇండియాతో టెస్టు రద్దు అయ్యాక అతడు తీవ్ర నిరాశ చెందాడా?

  • Share this:
    ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు (England Cricket Team) ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (Moeen Ali) టెస్టు క్రికెట్ (Test Cricket) నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) (ECB) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం యూఏఈలో ఐపీఎల్ 2021 (IPL 2021) ఆడుతున్న మొయిన్ అలీ తన నిర్ణయాన్ని కెప్టెన్ జో రూట్, కోచ్ సిల్వర్‌వుడ్‌కు తెలియజేశాడు. మొయిన్ అలీ చెప్పిన కారణాలతో వాళ్లు సంతృప్తి చెంది విషయాన్ని బోర్డుకు చేరవేశారు. ఈ మేరకు బోర్డు మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటన వెలువరించింది. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నా సరే.. మొయిన్ అలీ దేశవాళీ క్రికెట్, వన్డే, టీ20 క్రికెట్‌కు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. మొయిన్ అలీకి ఇండియా టీమ్‌పై మంచి రికార్డు ఉన్నది. అనేక సార్లు భారత జట్టు వికెట్లను పడొట్టి ఇంగ్లాండ్ జట్టుకు విజయాలను అందించాడు. అదే ఇండియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ అనంతరం మొయిన్ అలీ సగౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నాడు. కానీ ఒక విషయం అతడిని తీవ్రంగా బాధించినట్లు తెలుస్తున్నది.

    మొయిన్ అలీ ఇప్పటి వరకు 64 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటర్‌గా 111 ఇన్నింగ్స్‌లలో 2914 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో మొయిన్ అలీ అత్యధిక స్కోరు 155 నాటౌట్. ఇక 112 టెస్టు ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ 195 వికెట్లు తీశాడు. అయితే మరో వికెట్లు తీస్తే మొయిన్ అలీ ఖాతాలో 200 టెస్టు వికెట్లు చేరి ఉండేవి. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 14 మంది మాత్రమే 3000+ పరుగులు, 200+ వికెట్లు తీశారు. మొయిన్ అలీ ఈ అరుదైన రికార్డుకు దూరమ్యాడు.





    వాస్తవానికి సెప్టెంబర్ మొదటి వారంలో ఇండియా - ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఐదో టెస్టు జరగాల్సి ఉన్నది. అయితే టీమ్ ఇండియాలో కరోనా కలకలం రేగడంతో ఈ మ్యాచ్‌లను అర్దాంతరంగా వాయిదా వేశారు. ఈ మ్యాచ్‌ ఆడి ఐదు వికెట్లు తీసి రిటైర్మెంట్ ప్రకటించాలని మొయిన్ అలీ భావించాడు. కానీ మ్యాచ్ రద్దుకావడంతో తీవ్ర నిరాశ చెందినట్లు 'ఈఎస్‌పీఎన్‌క్రిక్ఇన్ఫో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మ్యాచ్ ఆడి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 76 పరుగులు, 5 వికెట్లు తీస్తే అరుదైన రికార్డు తన ఖాతాలో ఉండేదని.. కానీ మ్యాచ్ రద్దు కావడంతో ఏం చేయాలో అర్దం కాలేదని అన్నాడు.

    Team India: టీమ్ ఇండియా బస చేయనున్న లగ్జరీ హోటల్ ఇదే.. దుబాయ్‌లోని ది పామ్‌ను బుక్ చేసిన బీసీసీఐ


    'టెస్టు క్రికెట్‌లో ఒక అరుదైన ఘనత సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాకు మంచి రికార్డులు ఉన్నాయి. ఇంకా కొన్నాళ్లు ఆడితే ఆ రికార్డులు సాధించగలను. కానీ మాంచెస్టర్ టెస్టులోనే ఆ రికార్డులు కొల్లగొట్టి రిటైర్ అవుదామని నిర్ణయించుకున్నాను. కానీ మ్యాచ్ రద్దు అని చెప్పగానే నా మైండ్ ఒక్కసారిగా బ్లైండ్ అయ్యింది. ఇక అర్దమైంది నేను ఆ రికార్డులను చేరుకోలేనని. చాలా బాధపడ్డాను. కానీ నన్ను నేను సర్ది చెప్పుకున్నాను' అని మొయిన్ అలీ అన్నాడు.
    Published by:John Naveen Kora
    First published: