హోమ్ /వార్తలు /క్రీడలు /

గురు శిష్యులను ఏడిపించిన 2020.. ఇక 2021లో వారి పరిస్థితి ఎంటీ!

గురు శిష్యులను ఏడిపించిన 2020.. ఇక 2021లో వారి పరిస్థితి ఎంటీ!

dhoni-raina4

dhoni-raina4

2020.. ప్రపంచం ఎన్నడూ చూడని ఘోరా కలిని ఎదుర్కొంది. ప్రపంచం వణికిపోయింది. దేశాలన్ని లాక్ ‌డౌన్ అయ్యాయి. కార్యకాలపాలు అగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు క్షీణించాయి


2020.. ప్రపంచం ఎన్నడూ చూడని ఘోరా కలిని ఎదుర్కొంది. ప్రపంచం వణికిపోయింది. దేశాలన్ని లాక్ ‌డౌన్ అయ్యాయి. కార్యకాలపాలు అగిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు క్షీణించాయి. ఇలాంటి విపత్క పరిస్థితి నాటి సమాజం ఎన్నడూ చూసి ఉండదు. ఇలా ఈ ప్రపంచానికి 2020 ఏమాత్రం కలిసిరాలేదు. పకృతి ప్రకోపం వల్ల జీవన వ్యవస్థలు నిత్తేజం లోకి వెళ్ళాయి. అయితే కరోనా వల్ల కొందరికి కలసి రాకపోగా మరికొందరిని వ్యక్తి గతంగా కలిసి రాలేదు. ముఖ్యంగా భారత క్రికెటర్లు ఎంఎస్ ధోనీ,

సురేశ్‌ రైనాకు ఈ ఏడాది ఏమాత్రం ఆశినంత ఫలితాలు రాలేదు.

ధోనీకి కలిసిరాని 2020

ఐపీఎల్‌లో ధోనీ సారథ్యంలోని చైన్నై సూపర్ ఘోరంగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ధోనీ వైపల్యంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, సోషల్‌ మీడియా వేదికగా ధోనీ ఆట తీరుపై చర్చించుకుంటున్నారు. చివరి దశలో తన ఆటతీరు మందగిస్తుందా అంటూ విమర్శిస్తున్నారు. ఇక మరో బాట్స్‌మెన్ జాదవ్‌‌ను తిట్టిన తింటూ తిట్టుకుండా ట్రోల్స్ చేస్తున్నారు. సీనియర్‌ సిటిజన్స్ ఆటను చూడలేకపోతున్నాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పది సార్లు ఫ్లే ఆఫ్ చేరిన జట్టు..మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం ఇలా ఆడడం ఏంటంటూ క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది. ముఖ్యంగా ధోనీ నిర్ణయాలే జట్టు వైఫల్యం చెందడానికి కారణమైందని సీనియర్ క్రికెటర్లు బాహటంగానే పెదవి విరిచారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు ఆడించి తగిన మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డారు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్ళు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. అలాగే ఈ ఏడాదియే అతను క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం.. ఇలా మెుత్తంగా ధోనీ 2020 ఏమాత్రం కలిసి రాలేదు.

రైన్‌కు కన్నీళ్ళు మిగిల్చిన 2020

ఇక ఈ ఏడాది రైనాను బ్యాడ్ లక్ వెంటాడింది. ఐపీఎల్ 2020 నుంచి అనుహ్యంగా తప్పుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. తన బంధువుల హత్య కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చివరకు రైనా వివరణ ఇచ్చువకోవడంతో వివాదం కొంత మేరకు సద్దుమనిగింది. ప్రస్తుతం ఈ టీమిండియా మాజీ క్రికెటర్ కసరత్తుల చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలో జరగబోయే దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రైనా పాల్గోననున్నాడు. ఈ టోర్నీ కోసం ఇప్పటినుంచి సిద్దమవుతున్నాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటి వచ్చే ఐపీఎల్ నాటికి పూర్తిగా సిద్దం కావాలని ఆశిస్తున్నారు.

First published:

Tags: IPL 2020, Year Ender 2020

ఉత్తమ కథలు