హోమ్ /వార్తలు /క్రీడలు /

Olympics: ఒలింపిక్స్‌ క్రీడాకారులకు విక్టరీ ఫ్లవర్ బొకేలు ఎందుకు ఇస్తారు? వాటి ప్రాముఖ్యత ఏంటంటే..

Olympics: ఒలింపిక్స్‌ క్రీడాకారులకు విక్టరీ ఫ్లవర్ బొకేలు ఎందుకు ఇస్తారు? వాటి ప్రాముఖ్యత ఏంటంటే..

ఒలింపిక్ విజేతలకు ఫ్లవర్ బొకేలు ఎందుకు ఇస్తారు? (Olympics)

ఒలింపిక్ విజేతలకు ఫ్లవర్ బొకేలు ఎందుకు ఇస్తారు? (Olympics)

ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ లో గెలిచిన క్రీడాకారులకు మెడల్స్‌తో పాటు పూల బొకేలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తారో తెలుసా?

ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించడం ఆషామాషీ విషయం కాదు. ఒక్క మెడల్ సాధించినా.. కోట్లాది మంది గౌరవం పొందవచ్చు. ఒలింపిక్స్‌ మెడల్స్ సాధించిన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ మెడల్స్ కి ఉన్న ప్రాముఖ్యత చాలా మందికి తెలుసు. కానీ టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్ తో పాటు ఇచ్చే విక్టరీ ఫ్లవర్ బొకేల ప్రాముఖ్యత కొద్ది మందికే తెలిసి ఉంటుంది. నిజానికి ఈ విక్టరీ ఫ్లవర్ బొకేలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటో తెలుసుకుందాం, పదండి..

ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ లో గెలిచిన క్రీడాకారులకు మెడల్స్‌తో పాటు పూల బొకేలు ఇస్తున్నారు. ఈ బొకేలలో ఆకర్షణీయమైన పసుపు, ఆకుపచ్చ, బ్లూ ఫ్లవర్స్ మనం చూడొచ్చు. ఈ పూలు ఈశాన్య జపాన్‌లోని ఇవాటే, ఫుకుషిమా, మియాగి అనే 3 జిల్లాలలో పెరుగుతాయట. ఈ మూడు జిల్లాలు 2011లో వచ్చిన తోహుకు భూకంపం, సునామీ, ఫుకుషిమా అణు కర్మాగార విపత్తుల వల్ల చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తుల కారణంగా 20,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని బీబీసీ నివేదించింది. ఈ మూడు ప్రాంతాలు ఇప్పటికీ పునరుద్ధరణ ప్రయత్నాలలోనే ఉన్నాయట.

ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయిన ప్రజల గౌరవార్థం, జ్ఞాపకార్థం.. ఒలింపిక్స్ అథ్లెట్లు, పారాలింపిక్స్ (దివ్యాంగులు) అథ్లెట్లకు 5,000 పూల బొకేలను అందజేస్తున్నారు. అయితే బొకేలలో ఉన్న పసుపు రంగు సన్‌ఫ్లవర్‌ పూలు మియాగి ప్రిఫెక్చర్‌లో పెరిగినట్లు తెలుస్తోంది. సునామీ వల్ల తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు వారి జ్ఞాపకార్థం సన్‌ఫ్లవర్‌ పూల మొక్కలను నాటారు. ఇవి పెరిగే ప్రదేశాల్లో తమ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారని మృతుల తల్లిదండ్రులు నమ్ముతారు.

విపత్తు కారణంగా ఫుకుషిమా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. అయితే ఫుకుషిమా స్థానిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి లాభాపేక్ష లేని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తెలుపు, ఊదా రంగులో ఉండే యూస్టోమాస్, సోలమన్ సీల్స్ పూలను పెంచుతున్నారు. వీటిని కూడా బొకేలలో మనం చూడొచ్చు.

బొకేలలో బ్లూ కలర్ జెంటియన్లు కూడా చూడొచ్చు. ఇవి 2011 విపత్తు వల్ల దెబ్బతిన్న తీర ప్రాంతమైన ఇవాటేలో పెరిగాయి. ఇక ఈ బొకేలలో ఆకుపచ్చ ఆస్పిడిస్ట్రాస్‌ని కూడా చూడొచ్చు. ఇవి హోస్ట్ సిటీ టోక్యోలో పెరిగాయి. ఇవి టోక్యో నగరాన్ని సూచిస్తాయి. ఈసారి పాత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ రీసైక్లింగ్ చేసి ఒలింపిక్ మెడల్స్ తయారు చేశారట. ఇందుకు జపాన్ ప్రజలు 62 లక్షల మొబైల్ ఫోన్లను విరాళంగా ఇచ్చారట. అయితే గోల్డ్ మెడల్స్ కోసం మాత్రం 32 కిలోల బంగారం వినియోగించినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు