హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket : టీ20 క్రికెట్ ఆడిన తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి కెరీర్ ఎలా ముగిసిపోయిందంటే...

Cricket : టీ20 క్రికెట్ ఆడిన తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి కెరీర్ ఎలా ముగిసిపోయిందంటే...

Cricket Bat: ఈ కర్రతో తయారు చేసిన బ్యాట్ తో బంతిని కొడితే బౌండరీ ఖాయమట..!

Cricket Bat: ఈ కర్రతో తయారు చేసిన బ్యాట్ తో బంతిని కొడితే బౌండరీ ఖాయమట..!

అతడు టీ20 క్రికెట్ ఆడిన తొలి భారతీయుడు. సెహ్వాగ్ స్థానంలో అనుకోకుండా వచ్చి ఓపెనర్‌గా సెంచరీ కొట్టిన క్రికెటర్. కానీ అతడి కెరీర్ అర్దాంతరంగా ముగిసిపోయింది.

  ప్రస్తుతం టీ20 ఫార్మాట్ (T20 Format) క్రికెట్ అత్యంత ఆదరణ పొందింది. 3 గంటల్లో ముగిసిపోయే ధనాధన్ క్రికెట్ (Cricket)పట్ల అభిమానులు బాగా ఆకర్షించబడ్డారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుకోకుండా రూపొందించిన ఈ ఫార్మాట్ రెండు దశాబ్దాల అనంతరం క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నది. ఈ ఫార్మాట్ వచ్చిన కొత్తలో బీసీసీఐ విముఖత చూపించింది. అప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా టీమ్ ఇండియా మాత్రం టీ20 ఫార్మాట్ పట్ల మొగ్గు చూపలేదు. ఆ తర్వాత ఆ ఫార్మాట్‌లో ఉన్న మజాను అర్దం చేసుకొని 2006 డిసెంబర్‌లో తొలి టీ20 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడింది. అంటే భారత క్రికెటర్లు 2006లో టీ20 ఫార్మాట్ క్రికెట్ ఆడారు. కానీ, అంతకు ముందే ఒక భారత క్రికెటర్ టీ20 ఫార్మాట్ క్రికెట్ ఆడి రికార్డు సృష్టించాడు. టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ మోంగియా 2004లో లాంకషైర్ జట్టు తరపున టీ20 క్రికెట్ ఆడాడు. అలా టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయుడిగా (First Indian Cricketer) రికార్డులకు ఎక్కాడు. అంతే కాకుండా 2006లో టీమ్ ఇండియా తమ తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జట్టులో దినేశ్ మోంగియా కూడా ఉన్నాడు. అయితే మోంగియాకు అదే తొలి, చివరి టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.

  టీ20 ఫార్మాట్‌లో ఇండియా తరపున ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) చేరి చండీఘర్ లయన్స్ తరపున ఆడాడు. బీసీసీఐ బ్యాన్ చేసిన లీగ్‌లో ఆడటంతో అతడికి తర్వాత జట్టులో స్థానం లేకుండా పోయింది. అయితే కాగా, దినేశ్ మోంగియా 2001లో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 57 వన్డేలు ఆడిన మోంగియాకు.. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో చాలా పేరు వచ్చింది. జింబాబ్వేతో గౌహతీలో ఒక మ్యాచ్ జరగాల్సి ఉండగా.. సౌరవ్ గంగూలీతో దిగాల్సిన మరో ఓపెనర్ సెహ్వాగ్ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో దినేశ్ మోంగియాకు అవకాశం ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో మోంగియా 147 బంతుల్లో 159 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సమయంలో టీమ్ ఇండియా తరపున అది నాలుగో అతిపెద్ద సెంచరీ. సచిన్ టెండుల్కర్ (186), సౌరవ్ గంగూలీ (183), కపిల్ దేవ్ (175) తర్వాత దినేశ్ మోంగియా సెంచరీనే పెద్దది. ఆ సెంచరీ కారణంగా చాన్నాళ్ల పాటు జట్టులో కొనసాగాడు. కానీ నిలకడ లేమితో జట్టు నుంచి పూర్తిగా దూరమయ్యాడు.  జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సుభాష్ చంద్ర తీసుకొని వచ్చిన ఇండియన్ క్రికెట్ లీగ్ రెండు సీజన్లలో దినేశ్ మోంగియా ఆడాడు. బీసీీసఐ ఆ లీగ్‌లో ఆడిన క్రికెటర్లపై వేటు వేసింది. కపిల్ దేవ్ మధ్యవర్తిత్వంతో అంబటి రాయుడు వంటి ఆటగాళ్లు తిరిగి బీసీసీఐ పంచన చేరారు. అయితే దినేశ్ మోంగియా మాత్రం తన కెరీర్‌ను ముగించేశాడు.

  Published by:John Kora
  First published:

  Tags: Bcci, Cricket, T20, Team India

  ఉత్తమ కథలు