• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • WHO SUGGESTED KOHLI TO CORRECT HIS TECHNIQUE HOW VIRAT GAINED HIS FORM JNK

IPL 2021 : కోహ్లీ సూపర్ ఫామ్ వెనుక ఎవరున్నారు..? అతని ఫ్రెండ్ చెప్పిన నాలుగు చిట్కాలు ఏంటో తెలుసా?

IPL 2021 : కోహ్లీ సూపర్ ఫామ్ వెనుక ఎవరున్నారు..? అతని ఫ్రెండ్ చెప్పిన నాలుగు చిట్కాలు ఏంటో తెలుసా?

విరాట్‌కు సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? [PC: RCB@TWITTER]

  • Share this:
    టీమ్ ఇండియా కెప్టెన్, రన్ మెషిన్ అని పేరు పొందిన విరాట్ కోహ్లీ(Virat Kohli) బ్యాట్ నుంచి సెంచరీని చూసి ఏడాదిన్నర గడిచిపోయింది. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా అడపాదడపా అర్ద సెంచరీలు బాదడమే తప్ప.. జట్టుకు అవసరమైన సమయంలో విఫలమవుతూ వచ్చాడు. గత సీజన్ ఐపీఎల్ (IPL 2020) నుంచి ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ వరకు కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగించే రీతిలోనే ఉన్నది. కానీ ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి ఒక్కసారిగా తన ఫామ్‌ను సంపాదించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2021లో (IPL 2021) కూడా తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఏడాదికి పైగా నిలకడ లేని బ్యాటింగ్ ఫామ్ కొనసాగిస్తున్న కోహ్లీ తిరిగి తన బ్యాటుకు పని చెబుతున్నాడు. కోహ్లీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? కోహ్లీ ఎవరి వద్ద సలహా తీసుకున్నాడు? టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి సలహాలు ఏమైనా ఇచ్చాడా? బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఏమైనా చెప్పాడా? ఇలా అందరికీ డౌట్ వచ్చింది. ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నలకు అతని స్నేహితుడే సమాధానం చెప్పాడు.

    కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ ప్రపంచంలో స్నేహితులు చాలా మందే ఉన్నారు. కానీ తన మనసులోని మాటలు కూడా చెప్పుకునేది ముగ్గురికే అని ఒక సారి కోహ్లీనే పేర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ తనకు ఫ్రెండ్ మాత్రమే కాదు పెద్దన్న లాగ అని అన్నాడు. అలాగే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ చాలా దగ్గరి దోస్తు అని చెప్పాడు. వీరిద్దరి వద్ద క్రికెట్ విషయాల కంటే ఇతర విషయాలే ఎక్కువగా పంచుకుంటానని అన్నాడు. కానీ కోహ్లీ క్రికెట్ విషయాలు కూడా షేర్ చేసుకునేది కేవలం ఏబీ డివిలియర్స్‌తో మాత్రమే. తన బ్యాటింగ్ లోపాలు, షాట్లలో ఉండే టెక్నికల్ లోపాలను అతడితో చర్చించుకుంటాడట. ఇటీవల కోహ్లీ పేలవ ఫామ్‌తో బాధపడుతున్న సమయంలో దక్షిణాఫ్రికాలో ఉన్న ఏబీడీకి కాల్ చేశాడట. అప్పుడు ఏబీడీ చెప్పిన నాలుగు పాయింట్లను అమలు చేసి తన ఫామ్‌ను తిరిగి పొందినట్లు కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో కేవలం 49 బంతులకే 73 పరుగులు కొట్టడం వెనుక ఈ ఫార్ములానే ఉన్నట్లు చెప్పాడు.





    అయితే కోహ్లీ ఆ నాలుగు పాయింట్లేమిటో ఆ రోజు చెప్పలేదు. కానీ ఏబీడీ తాజాగా ఆర్సీబీ పర్సనల్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ నాలుగు పాయింట్లు ఏంటంటే.. 1. మొదట బంతిని చూడు 2. తర్వాత కూడా బంతిని చూస్తూనే ఉండు 3. ఆ బంతి నీ పరిధిలోకి వచ్చే వరకు వెయిట్ చెయ్యి 4. ఇక ఆ తర్వాత నీ బాడీ లాంగ్వేజ్ ప్రకారం బంతిపై నీ ప్రతిభ చూపించు. అని చెప్పాడట. మొత్తానికి ఏబీడీ ఏం చెప్పాడంటే.. చివరి క్షణం వరకు బంతినే గమనిస్తూ ఉండాలని.. ఆ తర్వాత మన స్టైల్లో బంతిని బాదేయాలని చెప్పాడు. సరిగ్గా కోహ్లీ కూడా అదే చేసి విజయం సాధించాడు. ఈ వీడియోను ఆర్సీబీ జట్టు తమ యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేసింది.
    Published by:John Naveen Kora
    First published: