హోమ్ /వార్తలు /క్రీడలు /

Saina : సైనా - కశ్యప్‌ల ప్రేమ కథలో విలన్ ఎవరు? వారిద్దరినీ విడదీసి ఏం చేద్దామనుకున్నాడు?

Saina : సైనా - కశ్యప్‌ల ప్రేమ కథలో విలన్ ఎవరు? వారిద్దరినీ విడదీసి ఏం చేద్దామనుకున్నాడు?

  భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి. చిన్నతనంలోనే రాకెట్ చేతపట్టి టైటిల్స్ సాధించడం మొదలు పెట్టిన సైనా బ్యాడ్మింటన్‌లో (Badminton) ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది. 2009లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకుకు చేరుకున్న సైనా.. 2015లో ప్రపంచ నెంబర్ 1 అయ్యింది. ఇదంతా ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. చిన్నప్పుడు 20 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి ఎల్బీ స్టేడియంలో శిక్షణ తీసుకునేది. 8 ఏళ్ల వయసులోనే అండర్ 10, అండర్ 12, అండర్ 13 రాష్ట్రస్థాయి టైటిల్స్ గెలుచుకున్నది. లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న సైనా.. తన కెరీర్‌లో అత్యధికంగా 24 టైటిల్స్ గెలుచుకున్నది. ఇవన్నీ చూస్తుంటే సైనా కెరీర్ సజావుగా సాగినట్లే అనిపిస్తుంది. కానీ సైనా కెరీర్, పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నది. ముఖ్యంగా తన ప్రేమ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

  సైనా గురించి తెలిసిన వాళ్లకు ఆమెకు కశ్యప్‌తో (Parupalli Kashyap) ఉన్న ప్రేమ గురించి కూడా తెలుసు. 2018లో వీళ్లు పెళ్లి చేసుకునే వరకు బయట ప్రపంచంలో ఎవరికీ వీరిద్దరు ప్రేమికులు అనే అనుమానమే రాలేదు. సైనా 7 ఏళ్ల వయసు నుంచే కశ్యప్‌తో పరిచయం ఉన్నది. వీరిద్దరూ కలసి శాప్ సెంటర్‌లో బ్యాడ్మింటన్ కోచింగ్‌కు వెళ్లే వారు. ఎల్బీ స్టేడియంలో ప్రతీ రోజు ప్రాక్టీస్ సమయంలో కలిసేవారు. చిన్నప్పుడు టోర్నీలకు కలసి పలు ప్రాంతాలకు వెళ్తుండటంతో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. వీరి స్నేహం గురించి తెలిసి సైనా కుటుంబంలో కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో వీరి జీవితంలోకి ఒక విలన్ ఎంటరయ్యాడు. ఆయనే కోచ్ పుల్లెల గోపీ చంద్.


  గోపీచంద్ గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేయాలని భావించాడు. నాణ్యమైన షట్లర్లకు ఉచితంగానే కోచింగ్ ఇచ్చేవాడు. కానీ గోపీచంద్ చాలా క్రమశిక్షణ కలిగిన కోచ్. తన నియమాలను పాటించని వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టే వాడు. సైనా ఆ అకాడమీ చేరినప్పుడు వరల్డ్ నెంబర్ 1 కావాలని ఉందని చెప్పింది. దీంతో ఆమెకు ప్రత్యేక శిక్షణతోపాటు డైట్ చార్ట్ కూడా ఇచ్చి బరువు తగ్గేలా చేశాడు. గోపీచంద్ శిక్షణలో అనేక టైటిల్స్ గెలిచిన సైనాకు పేరు ప్రఖ్యాతులతో పాటు డబ్బు కూడా వచ్చిపడింది. అదే సమయంలో కశ్యప్‌తో ప్రేమ బలపడింది. ఇద్దరూ బయట తిరగడం, సినిమాలు శికార్లు పెరిగిపోయాయి. బ్యాడ్మింటన్ అకాడమీలో కూడా వీరిద్దరే ప్రాక్టీస్ చేయడం, లంచ్ చేయడం గోపీ చంద్ గమనించాడు. ఒక రోజు సైనాను పిలిచి నువ్వు వరల్డ్ నెంబర్ వన్ కావాలనకుంటే కొన్నింటిని విడిచిపెట్టాలి. నువ్వు కశ్యప్‌తో కలసి తిరిగితే జీవితంలో అనుకున్నది సాధించలేవని కఠినంగా చెప్పాడు. గోపీచంద్ మాటను విన్న సైనా.. కశ్యప్‌ను దూరం పెట్టింది. ఆ తర్వాత ఆమె మరింత గొప్ప ప్లేయర్‌గా ఎదిగింది.

  ఈ విషయాలన్నీ సైనా బయోబపిక్‌లో చూపించారు. అయితే గోపీచంద్ బదులు ఆ సినిమాలో రాజన్  అనే పేరు వాడారు. ఆనాడు సైనా-కశ్యప్‌లను విడదీయం వల్ల సైనాకే మంచి జరిగింది. కేవలం సైనా కెరీర్ చక్కదిద్దడానికే ఇలా చేసినట్లు గోపీ స్వయంగా చెప్పారు.

  First published:

  Tags: Pullela Gopichand, Saina Nehwal

  ఉత్తమ కథలు