టీమిండియా కోచ్‌ ఆయనేనా..? ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి మొండి చెయ్యే..!

Cricket | Team India | ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం వరల్డ్ కప్ వరకే ముగిసింది. అయితే, వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల పాటు ఆయన పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 18, 2019, 4:45 PM IST
టీమిండియా కోచ్‌ ఆయనేనా..? ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికి మొండి చెయ్యే..!
రవిశాస్త్రి (ఫైల్ చిత్రం)
  • Share this:
ఇప్పుడు అందరి దృష్టి.. టీమిండియాకు కోచ్ ఎవరనే? టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రధాన కోచ్ సహా అన్ని విభాగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం వరల్డ్ కప్ వరకే ముగిసింది. అయితే, వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల పాటు ఆయన పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ఈ లోగా కొత్త కోచ్‌ను నియమించుకునేందుకు బోర్డుకు సమయం కూడా లభిస్తుంది. కిందటి సారి రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, వీరేంద్ర సెహ్వాగ్, రిచర్డ్ పైబస్ పోటీ పడ్డారు. చివర్లో సెహ్వాగ్, రవిశాస్త్రి పోటీ పడినా.. చివరికి రవిశాస్త్రి పదవిని దక్కించుకున్నారు.

అయితే, ఈ సారి రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ కూడా టీమిండియా కోచ్‌గా దరఖాస్తు చేసుకున్నారు. గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ కూడా దరఖాస్తు చేసుకుంటారని ఊహాగానాలు వెలువడ్డా.. ఓ నిబంధన కారణంగా వీరు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీమిండియా కోచ్‌గా టామ్ మూడీ నియమితులవుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

IPl 2019 Live Score, Dc vs SRH, srh coach tom moody, Delhi capital vs Sun Risers Hyderabad, SunRisers Hyderabad team ipl 2019, Delhi Capitals team ipl 2019, Delhi capitals captain, Rishabh pant, Shreyal ayar, Kane williamson, David warner ipl 2019, Bairstow ipl 2019, Dc vs SRH live score, srh vs dc live score ipl, Rashid khan ipl 2019, Yousuf pathan ipl 2019, david warner - bairstow partnership ipl 2019, ఢిల్లీ vs హైదరాబాద్ ఐపిఎల్ 2019, ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐపిఎల్ 2019 పూర్తి షెడ్యూల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్, యూసఫ్ పఠాన్, హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2019,ipl 2019 eliminator,ipl 2019,eliminator ipl match prediction,ipl 2019 eliminator match prediction,ipl,vivo ipl 2019 dc vs srh eliminator match,eliminator,eliminator match dc vs srh fixing report ipl fixing,dc vs srh match prediction,ipl live match,ipl 2019 playoffs,ipl eliminator match,match prediction,vivo ipl 2019 eliminator dc vs srh prediction,eliminator match dc vs srh full fixing reports, ఐపీఎల్, ఐపీఎల్ 2019, ఎలిమినేటర్ మ్యాచ్, సన్‌రైజర్స్,ఢిల్లీ మ్యాచ్ నేడే
డేవిడ్ వార్నర్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ...


అదే సమయంలో టామ్ మూడీ ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రచారం మరింత పెరిగింది. అనధికారికంగా టామ్ మూడీ కన్‌ఫర్మ్ అయ్యారని, అధికారిక ప్రకటనే మిగిలి ఉందని నెట్టింట్లో ప్రచారం నడుస్తోంది. అంటే.. రవిశాస్త్రికి కూడా ఉద్వాసన పలకాలని బీసీసీఐ యోచిస్తోందా? అని చర్చించుకుంటున్నారు. రవిశాస్త్రి కోచ్‌గా నియమితులయ్యాక.. టీమిండియా టెస్టుల్లో నంబరు వన్ స్థానాన్ని సాధించింది. వన్డేల్లో అనుకున్న రీతిలో రాణిస్తోంది.

Published by: Shravan Kumar Bommakanti
First published: July 18, 2019, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading