హోమ్ /వార్తలు /క్రీడలు /

Jaya Bhardwaj: ఈ జయ భరద్వాజ్ ఎవరు..? దీపక్ చాహార్ ప్రపోజ్ తో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

Jaya Bhardwaj: ఈ జయ భరద్వాజ్ ఎవరు..? దీపక్ చాహార్ ప్రపోజ్ తో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

Deepak Chahar Girl Friend: జయ భరద్వాజ్.. ఎవరీ అమ్మాయి.. ఎందుకింత క్రేజ్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈమే హాట్ టాపిక్ గా మారింది. జయ భరద్వాజ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటని గూగుల్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగింది. ఇంతకీ ఈ జయ భరద్వాజ్ ఎవరో తెలుసా..?

ఇంకా చదవండి ...

  Deepak Chahar Girl Friend Jaya Bhardwaj: ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)-పంజాబ్ కింగ్స్ (Panjab Kings 11) మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చోసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యామిలీ గ్యాలరీకి వెళ్లిన ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ (Deepak Chahar)తన ప్రేయసీకి ప్రపోజ్ చేశాడు. అది కూడా సినిమా స్టైల్లో మొకాలిపై కూర్చొని 'నేను నిన్న ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగాడు. దీపక్ చాహర్ చేసిన పనితో మొదట షాక్ కు గురైన ఆ అమ్మాయి. వాట్? అంటూ అతని ప్రేమను అంగీకరిస్తూ గట్టిగా హత్తుకుంది. తరువాత అతని చేత తన వేలికి ఉంగరాన్ని పెట్టించుకుంది. చాహర్‌కు కూడా రింగ్ పెట్టింది. ఇదంతా ఓ సినిమా సన్నివేశాన్ని తలపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై ఫ్యామీలీ గ్యాలరీకి వచ్చిన దీపక్ చాహర్.. ఏం తెలియనట్టూ కొద్దిసేపు నిలబడ్డాడు. ఆ తర్వాత ధోనీ కూతురు జీవా (Dhoni Daughter jiva)ను పక్కకు జరుపుతూ తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు.

  దీపక్ చేసిన పనితో పక్కనున్న వారంత అవాక్కయ్యారు. హోహో అంటూ చప్పట్లతో అభినందించారు. సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ జోడీని ఆశీర్వదించారు. ఇక కామెంటేటర్లు సైతం ఈ జోడి బాగుండాలని దీవించారు. దీపక్ చాహర్‌కు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. చెన్నై అభిమానులు చాహర్‌కు అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. మరోవైపు ఇక తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన మూమెంట్ అని ఈ వీడియోను చాహర్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.

  ఇదీ చదవండి: నవరత్న ఆయిల్ అంత పని చేసిందా..? బాత్ రూమ్ పైప్ లైన్లోకి దూరిన పాము.. చివరికి ఏం జరిగిందంటే..?

  ప్రస్తుతం దీపక్ చాహర్ లైవ్ లో ఆమెకు ప్రపోజ్ చేయడంతో అంతా.. ఆ అమ్మాయి.. ఎవరు? ఫారినర్ లేదా.? ఇండియన్..? దీపక్ ఎలా పరిచయం అంటూ గూగుల్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటోంది. ఇన్‌స్టా అకౌంట్‌ను కూడా ప్రైవేట్‌గా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ట్విట్టర్ ఖాతా తెరిచిన జయ భరద్వాజ్... దీపక్ చాహార్ ప్రపోజ్ చేసిన ఫోటోను పోస్టు చేసింది..

  ఇదీ చదవండి: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు.. 17 ఏళ్ల తరువాత సీన్ రిపీట్ అవుతుందా..?

  దీపక్ చాహార్ గర్ల్‌ఫ్రెండ్ పేరు జయ భరద్వాజ్... ఫారినర్‌లా కనిపిస్తున్నా, ఆమె విదేశీయురాలు కాదు, భారతీయురాలే.. బిగ్‌బాస్ సీజన్ 5 ప్రోగ్రామ్‌లో పాల్గొని, ఫైనల్ చేరిన వీడియో జాకీ, మోడల్, నటుడు సిద్ధార్థ్ భరద్వాజ్ చెల్లెలు జయ భరద్వాజ్.. ఆమె ప్రస్తుతం ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి పొజిషన్ లో సేవలందిస్తున్నారు.

  ఇదీ చదవండి: తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్.. పిల్లల కోసం WHO ఆమోదం

  దీపక్ చాహర్ తో గతంలోనే పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమె సహచర క్రికెటర్ల అందరికీ పరిచయం చేసినట్టు సమాచారం. ఇక తన సహచరుల బాటలోనే దీపక్ త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటాడని తెలుస్తోంది. తాజాగా ఆమె ఫారినర్ కాదు, తన పేరు జయ భరద్వాజ్’ అంటూ ఇన్‌స్టాలో తన తమ్ముడికి విషెస్ చెబుతూ పోస్టు చేసింది మాలతి చాహర్..

  First published:

  Tags: Csk, IPL, Sports

  ఉత్తమ కథలు