IPL 2021 : ఐపీఎల్‌లో అత్యధిక వేతనం తీసుకుంటున్న ఆల్‌రౌండర్లు ఎవరో తెలుసా? ఇంత వరకు వాళ్లు ఎంత సంపాదించారంటే..!

ఐపీఎల్‌లో అత్యధిక వేతనం పొందే ఆల్‌రౌండర్లు వీళ్లే.. [PC: ipl@twitter]

 • Share this:
  ప్రపంచంలోనే అత్యధిక వేతనాలు చెల్లించే క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2021)మాత్రమే. ఒక క్రికెటర్ జట్టుకు అవసరం అనుకుంటే ఫ్రాంచైజీలు ఎంత మొత్తమైనా చెల్లించడానికి వెనుకాడవు. ఫిబ్రవరిలో జరిగిన వేలం పాటలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) వదిలేసిన క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకు ముందు బెంగళూరు అతడికి రూ. 10 కోట్లు మాత్రమే చెల్లించింది. కానీ యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13లో మోరిస్ ప్రదర్శన అంచనాలను అందుకోక పోవడంతో అతడిని బెంగళూరు విడుదల చేసింది. మరోవైపు రాజస్థాన్ జట్టులో బెన్‌స్టోక్స్ వంటి ఆల్‌రౌండర్ (All rounder) ఉన్నా.. మోరిస్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్‌లో ముఖ్యంగా టీ20(T20) ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్ల అవసరం చాలా ఉంటుంది. స్పెషలిస్ట్ బౌలర్, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఉండటం కంటే ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల జట్టుకు ఉపయోగపడుతున్నది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించి ఆల్‌రౌండర్లను తమ జట్టులోకి తీసుకుంటుంటాయి. ప్రస్తుతం ఆడుతున్న ఆల్‌రౌండర్లలో అత్యధిక వేతనం అందుకుంటున్నది క్రిస్ మోరీస్. మరి మిగతా ఆల్ రౌండర్ల వేతనాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. క్రిస్ మోరీస్ - రూ. 16.25 కోట్లు
  2. కైల్ జేమిసన్ - రూ. 15 కోట్లు
  3. గ్లెన్ మ్యాక్స్‌వెల్ - రూ. 14.25 కోట్లు
  4. బెన్‌స్టోక్స్ - రూ. 12.50 కోట్లు
  5. హార్దిక్ పాండ్యా - రూ. 11 కోట్లు
  6. క్రిష్ణప్ప గౌతమ్ - రూ. 9.25 కోట్లు
  7. కృనాల్ పాండ్యా - రూ. 8.8 కోట్లు
  8. ఆండ్రీ రస్సెల్ - రూ. 8.50 కోట్లు
  9. రవిచంద్రన్ అశ్విన్ - రూ. 7.60 కోట్లు
  10 . రవీంద్ర జడేజా - రూ. 7 కోట్లు
  11. మొయిన్ అలీ - రూ. 7 కోట్లు
  12. డ్వేన్ బ్రావో - రూ. 6.40 కోట్లు
  13. సామ్ కర్రన్ - రూ. 5.5 కోట్లు
  14. కిరాన్ పొలార్డ్ - రూ. 5.4 కోట్లు
  15. టామ్ కర్రన్ - రూ. 5.20 కోట్లు

  ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ ద్వారా ఏయే ఆల్‌రౌండర్లు అత్యధికంగా సంపాదించారంటే

  1. షేన్ వాట్సన్ - రూ. 77.13 కోట్లు
  2. రవీంద్ర జడేజా - 77.0 కోట్లు
  3. కిరాన్ పొలార్డ్ - రూ. 74.53 కోట్లు
  4. రవిచంద్రన్ అశ్విన్ - రూ. 72.90 కోట్లు
  5. బెన్‌స్టోక్స్ - రూ. 65.50 కోట్లు
  6. గ్లెన్ మ్యాక్స్‌వెల్ - రూ. 63.42 కోట్లు
  7. క్రిస్ మోరీస్ - రూ. 59.17 కోట్లు
  8. క్రిస్ గేల్ - రూ. 58.56 కోట్లు
  9. పీయుష్ చావ్లా - రూ. 51.77 కోట్లు
  10. యూసుఫ్ పఠాన్ - రూ. 51.48 కోట్లు
  11. డ్వేన్ బ్రావో - రూ. 46.62 కోట్లు
  12. హార్దిక్ పాండ్యా - రూ. 44.30 కోట్లు
  13. ఇర్ఫాన్ పఠాన్ - రూ. 42.72 కోట్లు
  14. ఆండ్రీ రస్సెల్ - రూ. 41.05 కోట్లు
  15. కృనాల్ పాండ్యా - రూ. 39.20 కోట్లు
  Published by:John Naveen Kora
  First published: