టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే...సురేష్ రైనా ఆన్సర్‌కు నెటిజన్లు షాక్...

టీమిండియాలోని ఉత్తమ ఫీల్డర్‌ గురించి ప్రశ్నించగా, దీనికి రైనా మాట్లాడుతూ, 'అజింక్య రహానె క్యాచ్ పట్టుకునే నైపుణ్యాన్ని నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపాడు.

news18-telugu
Updated: May 25, 2020, 6:10 PM IST
టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే...సురేష్ రైనా ఆన్సర్‌కు నెటిజన్లు షాక్...
సురేష్ రైనా
  • Share this:
ప్రస్తుతం టీమిండియాలో అత్యంత చురుకైన ఫీల్డర్ ఎవరంటే అందరూ చెప్పే పేరు రవీంద్ర జడేజా. అయితే సురేష్ రైనా (టీం ఇండియా సీనియర్ బ్యాట్స్ మాన్) అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంటుంది. టీం ఇండియా ప్రస్తుత బెస్ట్ ఫీల్డర్ ఎవరని రైనాను ప్రశ్నిస్తే, అతను భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె అని పేరు చెప్పాడు. స్పోర్ట్స్ స్క్రీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా టీమిండియాలోని ఉత్తమ ఫీల్డర్‌ గురించి ప్రశ్నించగా, దీనికి రైనా మాట్లాడుతూ, 'అజింక్య రహానె క్యాచ్ పట్టుకునే నైపుణ్యాన్ని నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపాడు. అతని క్యాచింగ్ స్కిల్స్ , ఫీల్డింగ్ సమయంలో అతని బాడీ లాంగ్వేజ్ చాలా బాగుందని తెలిపాడు. అతని ఫీల్డింగ్ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నాడు. అతను కదిలేటప్పుడు కొద్దిగా వంగి ఉంటాడు. ఇది ఇతర ఆటగాళ్ళ నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుందని పేర్కొన్నాడు.

స్లిప్‌లో తరచుగా ప్రశంసలు అందుకున్న రహానే, ఎడమచేతి వాటంను ప్రశంసించాడు, "అతను గొప్ప స్లిప్ ఫీల్డర్, అతను బ్యాట్స్ మాన్ కదలికను చూసిన తరువాత బంతి దిశను తెలుసుకుంటాడు." స్లిప్ ఫీల్డర్లు బ్యాట్స్‌మన్‌కు దూరంగా ఉన్నందున ఇది చాలా ముఖ్యం. రహానె కూడా ఈ విషయాలను బాగా గుర్తిస్తాడని, తద్వారా మ్యాచ్‌లో అలాంటి పరిస్థితులు అతనికి తేలికగా ఉంటాయని అన్నాడు.
First published: May 25, 2020, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading