Home /News /sports /

Ranji Trophy: బ్యాటింగ్‌లో బ్యాక్‌ఫుట్ షాట్లు నేర్పింది ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది?

Ranji Trophy: బ్యాటింగ్‌లో బ్యాక్‌ఫుట్ షాట్లు నేర్పింది ఎవరు? రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది?

రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? (PC: BCCI)

రంజీ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? (PC: BCCI)

Ranji Trophy: క్రికెట్‌లో అప్పటి వరకు ఉన్న షాట్లనే మార్చేసిన వ్యక్తి రంజిత్ సింగ్‌జీ. బ్యాక్‌ఫుట్, లెగ్ గ్లాన్స్, స్క్వేర్ కట్ షాట్లను క్రికెట్‌లో ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. నేడు మహరాజా రంజిత్‌ సింగ్‌జీ పుట్టిన రోజు.

    క్రికెట్ (Cricket) ఆడటం మొదలైన దగ్గరి నుంచి 1890 దశకాల వరకు బ్యాటింగ్ అంటే ఒకటే స్టైల్ ఉండేది. ఏ బ్యాట్స్‌మెన్ అయినా సరే బంతిని ముందుకు వచ్చి బాదడమో.. నేరుగా కొట్టడమో చేసే వాళ్లు. అంతే కాని ఇప్పటిలా వైవిధ్యభరితమైన షాట్లు ఉండేవి కావు. ఇప్పుడు టీ20 (T20 Cricket) మ్యాచ్‌లు, ఐపీఎల్ (IPL) వంటి లీగ్స్ చూస్తుంటే బ్యాట్స్‌మెన్ పిచ్‌పై పడుకొని మరీ షాట్లు కొడతాడా అనేంతగా మారింపోయింది. కానీ అప్పట్లో ఒకో ఒక షాట్.. ముందుకు వచ్చి బంతిని బలంగా బాదడమే. అయితే ఈ మూస ధోరణి అంతటినీ పటాపంచలు చేసిన ఏకైక క్రికెటర్ కల్నల్ రంజిత్‌సింగ్‌జీ విభాజీ-2. అవిభాజ్య భారత్‌లోని కచ్ ప్రాంతంలో ఉన్న నవానగర్ రాజ్యానికి ఆయన రాజు. కానీ క్రికెట్ అంటే ఆయనకు ఎనలేని మక్కువ. ఇంగ్లీష్ క్రికెట్ టీమ్ తరపున ఆయన ఇంగ్లాండ్‌లో ఫస్ట్ క్లాస్, టెస్ట్ క్రికెట్ ఆడారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ, ససెక్స్ కౌంటీ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఆల్‌టైం టెస్ట్ గ్రేటెస్ట్ బ్యాట్స్‌మెన్లలో రంజిత్‌సింగ్‌జీ ఒకరు. ఆయన పుట్టిన రోజు నేడు.

    అప్పటి వరకు ఉన్న క్రికెటింగ్ షాట్లనే మార్చేసిన వ్యక్తి రంజిత్‌సింగ్‌జీ. బ్యాక్ ఫుట్ షాట్లు మొదటి సారిగా రంజిత్ సింగ్‌జీనే ఆడాడు. బ్యాక్‌ఫుట్, స్క్వేర్ కట్ షాట్లకు మాత్రమే కాకుండా డిఫెన్స్ ఆడటంలో కూడా వైవిధ్యం చూపించే వాడు. పిచ్‌కు తగినట్లు షాట్లు ఎంచుకోవడంతో రంజిత్‌సింగ్‌జీకి మించిన బ్యాట్స్‌మాన్ లేడు. లెగ్ గ్లాన్స్ షాట్ తొలి సారి ఆడిన క్రికెటర్ కూడా రంజిత్ కావడం గమనార్హం. రంజిత్ ఇంగ్లాండ్‌లో సాధించిన విజయాలకు జ్ఞాపకంగా పటియాలాకు చెందిన మహరాజా భూపీందర్ సింగ్ ఒక ఫస్ట్ క్లాస్ టోర్నీని ప్రారంభించాడు. దాని పేరు రంజీ ట్రోఫీ. చరిత్రలో తొలి సారిగా 1935లో రంజీ ట్రోఫీ (Ranji Trophy) ప్రారంభమైంది.





    1886లో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడిన రంజిత్.. 1902లో ఆస్ట్రేలియాపైనే చివరి టెస్టు ఆడాడు. 15 టెస్టుల్లో 989 పరుగులు, 307 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 24,692 పరుగులు చేశాడు. టెస్టుల్లో 2, ఫస్ట్ క్లాస్‌లో 72 సెంచరీలు నమోదు చేశాడు. ఇక టెస్టుల్లో ఒక వికెట్, ఫస్ట్ క్లాస్‌లో 133 వికెట్లు తీశాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక రంజిత్ సింగ్‌జీ 1907లో నవానగర్‌కు మహరాజుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌కు ఛాన్సలర్‌గా వ్యవహరించాడు. లీగ్ ఆఫ్ నేషన్స్‌లో భారత ప్రతినిధిగా ఉన్నాడు. రంజిత్ సింగ్‌జీ మేనల్లుడు దులీప్‌సింగ్‌జీ కూడా మామ బాటలోనే బ్యాటు పట్టాడు. ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. దులీప్‌సింగ్‌జీ పేరు మీదనే బీసీసీఐ.. దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు