• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • WHILE KOHLIS TEAM INDIA IN ENGLAND ANOTHER INDIAN TEAM TO TOUR IN SRILANKA SAYS BCCI JNK

BCCI : అక్కడ ఇంగ్లాండ్‌లో భారత జట్టు.. కానీ ఇక్కడ శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్.. ఎలా సాధ్యం?

BCCI : అక్కడ ఇంగ్లాండ్‌లో భారత జట్టు.. కానీ ఇక్కడ శ్రీలంకలో వన్డే, టీ20 సిరీస్.. ఎలా సాధ్యం?

ఇంగ్లాండ్‌లో టెస్టులు.. శ్రీలంకలో వన్డేలు (PC: BCCI)

అక్కడ ఇంగ్లాండ్‌లో కోహ్లీ సారథ్యంలోని సీనియర్ టీమ్ టెస్టులు ఆడుతుండగానే.. ఇక్కడ శ్రీలంకలో మరో టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడనున్నది. బీసీసీఐ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో?

  • Share this:
    విరాట్ కోహ్లీ(Virat Kohli) సారథ్యంలోని టీమ్ ఇండియా (Team India) ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour)ఉండగానే.. మరో భారత జట్టు శ్రీలంకలో (Srilanka) పర్యటనకు వెళ్లనున్నట్లు బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తెలిపాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్, 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్నది. సౌతాంప్టన్ వేదికగా న్యూజీలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నది. జూన్ 18 నుంచి 22 వరకు జరిగే ఫైనల్ ముగిసిన తర్వాత కూడా టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లోనే ఉండిపోతుంది. డబ్ల్యూటీసీ ముగిసిన నెల రోజుల తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అయితే ఈ నెలరోజుల్లో భారత జట్టు శ్రీలంకలో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. కానీ, శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టులో ఇంగ్లాండ్ వెళ్లిన టెస్టు జట్టు సభ్యులు ఉండరని చెప్పాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకుండానే శ్రీలంకలో మరో జట్టు పర్యటించనున్నది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లని పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసి శ్రీలంక పర్యటనకు పంపనున్నట్లు గంగూలీ చెప్పారు.

    టీమ్ ఇండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. వీళ్లు వన్డే స్పెషలిస్టులుగా ముద్రపడ్డారు. వీరితో పాటు రాహుల్ చాహర్, రాహుల్ తెవాతియా, దేవ్‌దత్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పృథ్వీషా వంటి యువకులను కూడా జత చేసి భారత జట్టును రూపొందించే అవకాశం ఉన్నది. ఆ సమయానికి శ్రేయస్ అయ్యర్ గనుక ఫిట్‌నెస్ సాధిస్తే అతడు జట్టులోకి రావడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉన్నది. గతంలో భారత జట్టు విషయంలో బీసీసీఐ ఎప్పుడూ ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఒక సమయంలో ఒకే జట్టు పర్యటనకు వెళ్లేది. కానీ ఒక జట్టు ఒక దేశంలో టెస్టు సిరీస్‌ కోసం ఉంటే.. మరో జట్టు మరో దేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం పర్యటించడం ఒక సంచలన నిర్ణయమే అనుకోవాలి. రానున్న రోజుల్లో భారీ షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడానికి ఇలాంటి ప్రయోగాలు అవసరమని సౌరవ్ గంగూలీ చెబుతున్నారు.

    రషీద్ ఖాన్ ఇల్లు చూసి అవాక్కవుతున్న క్రికెటర్లు.. ఆ ప్యాలెస్ చూసి మహిళా క్రికెటర్ బుగ్గలు ఎర్రబడ్డాయి..




    శ్రీలంకలో పర్యటించే భారత జట్టు 5 టీ20లతో పాటు 3 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుందని బీసీీసీఐ స్పష్టం చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే ఈ జట్టుకు సంబంధించిన క్రికెటర్ల సెలెక్షన్ జరుగుతుందని. అప్పటిలోగా బీసీీసీఐ, శ్రీలంక క్రికెట్ సమన్వయంతో షెడ్యూల్ రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు