Afghanistan Crisis: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌లో అఫ్గానిస్తాన్.. ఆ క్రికెటర్లు దేశం వదిలి వస్తారా?

అఫ్గానిస్తాన్ క్రికెటర్లు టీ20 వరల్డ్ కప్ ఆడతారా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? (PC: ICC)

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ దేశ క్రికెటర్లు టీ20 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే సందిగ్దత నెలకొన్నది. దీనిపై ఏసీబీ సీఈవో హమీద్ క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించుకొని అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. దీంతో ఆ దేశ క్రికెటర్లు టీ20 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే దానిపై సందిగ్దత నెలకొన్నది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ గగనతలం మూసేయడమే కాకుండా అక్కడి నుంచి ఎటువంటి రాకపోకలను తాలిబన్లు అంగీకరించడం లేదు. మరోవైపు యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి జరుగనున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. గత ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఇప్పటికే అఫ్గానిస్తాన్ జట్టు సూపర్-12కు అర్హత సాధించింది. దీంతో అఫ్గానిస్తాన్‌తో కలపి ఐసీసీ పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. కాగా, తాలిబన్లు ఈ జట్టు వరల్డ్ కప్ ఆడటానికి అంగీకరిస్తారా లేదా అనే దానిపై అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సీఈవో హమీద్ షిన్వారీ క్లారిటీ ఇచ్చారు. 'తమ జట్టు పర్యటనలను ఎవరూ అడ్డుకోబోవడం లేదు.. అఫ్గాన్ జట్టు ఆడటానికి ఎటువంటి అవాంతరాలు ఎదురు కావు.. షెడ్యూల్ ప్రకారమే జట్టు పర్యటనలు ఉంటాయి' అని ఆయన చెప్పారు. త్వరలో అఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరనున్నది. అంతకు ముందే కాబూల్‌లో మూడోక్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంప్‌కు అందుబాటులో ఉన్న క్రికెటర్లు అందరూ పాల్గొంటారని సమాచారం.

    ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అందరూ భయాందోళనలో ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో పరిస్థితులు సద్దుమణుగుతాయని భావిస్తున్నట్లు హమీద్ చెప్పారు. శ్రీలంక పర్యటన తర్వాత తాము పాకిస్తాన్‌తో కూడా సిరీస్ ఆడబోతున్నట్లు ాయన వెల్లడించారు. కాబూల్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణంగా మారుతున్నది. కార్యాలయాలు కూడా తెరుచుకుంటున్నాయి. క్రికెట్ కార్యాకలాపాలు కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమవుతాయని హమీద్ చెప్పారు. క్రికెట్ ఎప్పుడూ కూడా ఇతరుల చేతుల్లో లేదు. గత ప్రభుత్వాలు కూడా క్రికెట్ బోర్డు కార్యాకలాపాల్లో ఏనాడూ తలదూర్చలేదు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్లు కూడా అదే పద్దతిని అనుసరిస్తారని భావిస్తున్నామని హమీద్ చెప్పుకొచ్చారు. కాగా, అఫ్గానిస్తాన్ జట్టుకు చెందిన రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నారు.

    ఐసీసీ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం అఫ్గానిస్తాన్ సూపర్ 12 గ్రూప్ 2లో ఉన్నది. తొలి మ్యాచ్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో బీ గ్రూప్‌ రన్నరప్‌తో తలపడనున్నది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌తో యూఏఈలోనే టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్ జట్టు తలపడుతుంది. శ్రీలంక నుంచి నేరుగా యూఏఈ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

    అఫ్గానిస్తాన్ పూర్తి షెడ్యూల్:

    అక్టోబర్ 25 - బీ1తో షార్జాలో
    అక్టోబర్ 29 - పాకిస్తాన్‌తో దుబాయ్‌లో
    అక్టోబర్ 32 - ఏ2తో అబుదాబిలో
    నవంబర్ 3 - ఇండియాతో అబుదాబిలో
    నవంబర్ 7 - న్యూజీలాండ్‌తో అబుదాబిలో
    Published by:John Naveen Kora
    First published: