Home /News /sports /

WHEN YOU ARE DROPPED FROM THE TEAM YOU LOVE AND STRIPPED OF CAPTAINCY WITHOUT A REASON IT HURTS SAYS DAVID WARNER JNK

David Warner: 'జట్టు కోసం ఎంతో చేశా... ఎంతో కష్టపడ్డా.. చివరకు ఇలా చేస్తారా? ఏదేమైనా నాకు తోడుంది వాళ్లే'.. నోరు విప్పిన వార్నర్

మనసులో బాధను బయటపెట్టిన డేవిడ్ వార్నర్ (PC: IPL)

మనసులో బాధను బయటపెట్టిన డేవిడ్ వార్నర్ (PC: IPL)

David Warner: ఐపీఎల్ 2021 సమయంలో కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయి అవమానాలు పడిన డేవిడ్ వార్నర్ నోరు విప్పాడు. ఆనాటి తన బాధను తొలి సారిగా మీడియాకు వెల్లడించాడు.

  ఐపీఎల్ 2021 (IPL 2021) తొలి దశలో పూర్తిగా విఫలం కావడంతో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌ను (David Warner) సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కేవలం కెప్టెన్‌గా తప్పించడమే కాకుండా తుది జట్టులో స్థానం ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఇక రెండో దశలో అయితే కనీసం జట్టు ఆడే సమయంలో గ్రౌండ్‌కు కూడా రాకుండా హోటల్ రూమ్‌కే పరిమితం అయ్యాడు. కొన్ని సార్లు మైదానానికి వచ్చినా ఆటగాళ్లతో పాటు డగౌట్‌లో కూర్చోకుండా గ్యాలరీల్లో కూర్చున్నాడు. స్టార్ క్రికెటర్‌ పట్ల సన్‌రైజర్స్ యాజమాన్యం అలా ప్రవర్తించడం మంచిది కాని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కూడా వచ్చాయి. డేవిడ్ వార్నర్ అప్పట్లో కేవలం ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో సైంజ్ఞలతో మాత్రమే పోస్టులు పెట్టాడు. సన్నిహితుల వద్ద తన బాధను చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏనాడు బయట పడలేదు.

  ఇక ఐపీఎల్ తర్వాత నేరుగా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఆడిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌లో పూర్తి మార్పు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేని ఆస్ట్రేలియా జట్టు (Australia Cricket Team) టీ20 వరల్డ్ కప్ గెలవడంలో వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ సమయంలో తనపై వచ్చిన విమర్శలంన్నింటికీ వార్నర్ బ్యాటుతో సమాధానం చెప్పాడు. టోర్నీలో మొత్తం 289 పరుగులతో ఆసీస్‌ను గెలిపించాడు. అంతే కాకుండా అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన వార్నర్ తన మనసులో బాధను బయటపెట్టాడు.

  Virat Kohli: ఎంట్రీ నిరాకరించిన విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం


  'గత కొన్నేళ్లుగా నేను ఎంతగానో ఇష్టపడిన జట్టు తనను ఏ తప్పూ చేయకుండానే అకారణంగా తొలగించడం చాలా బాధాకరంగా అనిపించింది. కెప్టెన్సీ నుంచి నన్ను తప్పించడం చాలా బాధాకరమైన విషయం. ఈ జట్టు కోసం ఏన్నో ఏళ్లు నిరంతరంగా శ్రమించాను. కానీ చివరకు ఇలా చేశారు. ఈ విషయంలో ఎవరిపైనా నేను పిర్యాదు చేయాలని అనుకోవడం లేదు. ఈ కష్ట సమయంలో నాకుఅండగా ఉన్నది కేవలం అభిమానులే. వాళ్ల కోసమే ఆడుతున్నాను. వాళ్లను అలరించడానికే నేను ఉన్నాను. నన్ను ఎందుకు తొలగించారో నాకైతే కారణం తెలియదు. అయితే ఈ జట్టు కోసం ఎంతో కష్టపడ్డాను. నేను మరింత మెరుగు పడాలని రోజు ప్రాక్టీస్ చేశాను. నెట్స్‌లో బ్యాటింగ్ చేయని రోజు లేదు. అయితే సమయానికి పరుగులు రాబట్టలేక పోయాను. ప్రతీ ఆటగాడి జీవితంలో అలాంటి రోజులు ఉంటాయి. కానీ ఎవరూ నా బాధను అర్దం చేసుకోలేదు.' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

  Drinking Beer in Shoe: షూలో బీర్లు పోసుకొని తాగడం ఆచారం అంటా.. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది?


  ఐపీఎల్‌లో నా అధ్యాయం ఇంకా ముగిసిపోలేదని.. భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు వార్నర్ అభిప్రాయపడ్డాడు. కాగా, డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేయడం దాదాపు ఖాయమే. వచ్చే ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లేదా కొత్త జట్లలో ఏదో ఒకటి వార్నర్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వార్నర్ కూడా వేరే జట్టులో కెప్టెన్సీ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నాడు.
  Published by:John Kora
  First published:

  Tags: David Warner, IPL 2021, Sunrisers Hyderabad

  తదుపరి వార్తలు