హోమ్ /వార్తలు /క్రీడలు /

Dhoni Fever: డెన్‌లో సింహాన్ని చూసి..! 'ధోనీ ధోనీ ధోనీ' వీడియో ఇదిగో!

Dhoni Fever: డెన్‌లో సింహాన్ని చూసి..! 'ధోనీ ధోనీ ధోనీ' వీడియో ఇదిగో!

మ్యాచ్ చూస్తోన్న ధోనీ

మ్యాచ్ చూస్తోన్న ధోనీ

Dhoni Fever: రాంచీ అభిమానుల కోరిక తీర్చాడు మహేంద్రుడు. తన ఇలాకాలో జరిగిన మ్యాచ్‌కు చూడటానికి వచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అంతేకాదు రాంచీలో మ్యాచ్‌ చూడటానికి ధోనీతో పాటు అతడి సతీమణి సాక్షి సింగ్‌ కూడా వచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ధోనీని టీవీ స్క్రీన్‌పై చూపించగానే ఫ్యాన్స్‌ అంతా ఓకేసారి 'ధోనీ ధోనీ ధోనీ' అంటూ స్లోగన్స్‌ వినిపించారు. ఒక్కసారిగా ధోనీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లిపోయింది.గ్యాలరీలో తన సన్నిహితుల మధ్య మ్యాచ్ చూస్తోన్న ధోనీని కెమెరామ్యాన్‌ చాలాసార్లు చూపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌గా ఆనందపడ్డారు. అటు ధోనీ కూడా ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వాళ్లని మరింత ఖుషీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాంచీ అభిమానుల కోరిక తీర్చాడు మహేంద్రుడు. తన ఇలాకాలో జరిగిన మ్యాచ్‌కు చూడటానికి వచ్చి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. అంతేకాదు రాంచీలో మ్యాచ్‌ చూడటానికి ధోనీతో పాటు అతడి సతీమణి సాక్షి సింగ్‌ కూడా వచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ధోనీని టీవీ స్క్రీన్‌పై చూపించగానే ఫ్యాన్స్‌ అంతా ఓకేసారి 'ధోనీ ధోనీ ధోనీ' అంటూ స్లోగన్స్‌ వినిపించారు. ఒక్కసారిగా ధోనీ నామస్మరణతో స్టేడియం దద్దరిల్లిపోయింది.గ్యాలరీలో తన సన్నిహితుల మధ్య మ్యాచ్ చూస్తోన్న ధోనీని కెమెరామ్యాన్‌  చాలాసార్లు చూపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌గా ఆనందపడ్డారు. అటు ధోనీ కూడా ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వాళ్లని మరింత ఖుషీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

ధోనీ చుట్టూనే రాంచీ మ్యాచ్‌ :

నిజానికి రాంచీలో మ్యాచ్‌ అనగానే అభిమానులతో పాటు క్రికెటర్లకు కూడా ధోనీనే గుర్తొచ్చాడు. ధోనీ అంటే ఉన్న ప్రేమ అలాంటిది మరి. తమ రోల్‌మోడల్‌తో మాట్లాడేందుకు ఇటు యువ ఇండియన్‌ టీమ్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తే తమ ఆరాధ్య దైవాన్ని చూసేందుకు ధోనీ మ్యాచ్‌ చూడటానికి రావాలని ఫ్యాన్స్‌ ఎంతగానో కోరుకున్నారు. వాళ్లు కోరుకున్నట్లే ధోనీ మ్యాచ్‌ చూడటానికి వచ్చాడు. అది కూడా భార్య సాక్షితో రావడంతో ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ లభించినట్లైంది. ఇక మ్యాచ్‌కు ముందు కూడా టీమిండియా ప్రాక్టీస్‌ టైమ్‌లో ధోనీ గ్రౌండ్‌కు వచ్చాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లని కలిసి ముచ్చటించాడు. స్టేడియం లోపల కొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించిన ధోనీ వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

ధోనీ గడ్డపై టీమిండియా ఫెయిల్‌:

ధోనీ డెన్‌లో కివీస్‌తో జరిగిన తొలి పోరులో టీమిండియా ఓడిపోయింది. టీ20 సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది. ఈ విజయంతో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇకతర్వాతి మ్యాచ్ జనవరి 29న లక్నోలో జరగనుంది.

First published:

Tags: India vs newzealand, MS Dhoni, Ranchi

ఉత్తమ కథలు