సెక్యూరిటీ కళ్లుగప్పి తప్పించుకున్న గంగూలీ.. వీధుల్లోకి వెళ్లి..

బీసీసీఐ అధ్యక్షుడు,భారత మాజీ కెప్టెన్ గంగూలీ 2003-04లో జరిగిన పాకిస్తాన్‌ పర్యటనను మరోసారి గుర్తుచేసుకున్నారు.

news18-telugu
Updated: December 29, 2019, 4:11 PM IST
సెక్యూరిటీ కళ్లుగప్పి తప్పించుకున్న గంగూలీ.. వీధుల్లోకి వెళ్లి..
సౌరవ్ గంగూలీ (File Photo)
  • Share this:
బీసీసీఐ అధ్యక్షుడు,భారత మాజీ కెప్టెన్ గంగూలీ 2003-04లో జరిగిన పాకిస్తాన్‌ పర్యటనను మరోసారి గుర్తుచేసుకున్నారు. అత్యంత భద్రత నడుమ సాగిన ఆ పర్యటనలో సెక్యూరిటీతో విసుగొచ్చేసిందని చెప్పుకొచ్చారు. ఏకె-47 గన్స్‌ పట్టుకుని హోటల్ రూమ్ ముందే సెక్యూరిటీ కాపలా కాసేవారని, పొద్దున లేవగానే గన్స్ పట్టుకున్న ముఖాలను చూడాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. ఎక్కడికెళ్దామన్నా సెక్యూరిటీ తమతోనే ఉండేదని.. దీంతో ఇక లాభం లేదనుకుని,తానే ఒకరోజు సెక్యూరిటీ కళ్లు గప్పి బయటకు వెళ్లానని చెప్పారు.

ఆ సెక్యూరిటీని చూస్తే పిచ్చెక్కిపోయేది. దీంతో వాళ్ల కంటపడకుండా ఒకరోజు హోటల్ రూమ్‌ నుంచి బయటపడ్డాను. అలా కరాచీ వీధుల్లోకి వెళ్లి కబాబ్స్ టేస్ట్ చేస్తుంటే.. నా జర్నలిస్టు మిత్రుడు రాజ్‌దీప్ సర్దేశాయికి దొరికిపోయాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రాజ్‌దీప్ చూసి నవ్వుకుంటాడని అనుకుంటున్నాను.
సౌరవ్ గంగూలీ,బీసీసీఐ అధ్యక్షుడు


కరాచీలో విమానాశ్రయం నుంచి హోటల్ రూమ్‌కి వెళ్తున్నప్పుడు రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయని గంగూలీ చెప్పారు. ప్రధాన రహదారికి దారితీసే అన్ని రోడ్లను అక్కడి పోలీసులు బ్లాక్ చేసినట్టు చెప్పారు. ప్రతీ చోట,ప్రతీ మలుపులో సెక్యూరిటీని మోహరించారని చెప్పారు. హోటల్లో తమకు మూడో అంతస్తును కేటాయించారని.. తాము ఆ హోటల్లో ఉన్న కారణంగా రెండో అంతస్తును,నాలుగో అంతస్తును ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. ఆ పర్యటన ఆసాంతం కట్టుదిట్టుమైన భద్రత నడుమ జరిగిందని గుర్తుచేసుకున్నారు.
First published: December 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు