నాకు పెళ్లి కాదని భయపెట్టారు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సానియా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మహిళా నాయకత్వం అనే అంశంపై జరిగిన చర్చలో లింగ వివక్షపై మాట్లాడారు.

news18-telugu
Updated: October 3, 2019, 4:36 PM IST
నాకు పెళ్లి కాదని భయపెట్టారు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
సానియా మిర్జా
news18-telugu
Updated: October 3, 2019, 4:36 PM IST
చంద్రుడి మీదకు రాకెట్లు పంపుతున్న ఈ కాలంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది. ఇంట్లో పెంపకం నుంచి మొదలుకొని చదువు, ఉద్యోగం.. ఇలా అన్ని చోట్ల ఆమెపై చిన్నచూపే చూస్తోంది నేటి సమాజం. ఐతే వీటన్నింటినీ దాటుకొని ఎంతో మంది వనితలు చరిత్ర సృష్టించారు. ఉన్నత స్థానాలను అధిరోహించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు. వారిలో ఒకరు సానియా మిర్జా. ఐతే ఈ హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌కూ గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయట. ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సానియా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. మహిళా నాయకత్వం అనే అంశంపై జరిగిన చర్చలో లింగ వివక్షపై మాట్లాడారు.

టెన్నిస్ ఆడడం ఆపివేయాలని చిన్నతనంలో తనకు చాలా మంది చెప్పినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు సానియా. టెన్నిస్ ఆడే అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోరని చెప్పేవారని వెల్లడించారు. తల్లిదండ్రుల నుంచి మొదలు కొని బంధువులు, చుట్టుపక్కల ప్రజలు అందరూ ఇలాంటి సలహాలే ఇచ్చారని చెప్పారు. టెన్నిస్ బయటి వాతావరణంలో ఆడే ఆట కావడంతో.. చర్మం కమిలిపోయి నల్లగా మారుతుందని వారంతా ఆందోళన చెందేవారని తెలిపారు సానియా. ఆ కారణంతో తనను ఎవరూ పెళ్లి చేసుకోరని వారిలో భయం నెలకొందని వివరించారు. ఐతే అప్పుడు తాను 8 ఏళ్ల చిన్నపిల్లనే కాబట్టి, అవేమీ పట్టించుకోకుండా ఆటపై శ్రద్ధ పెట్టానని చెప్పుకొచ్చారు ఈ టెన్నిస్ బ్యూటీ.

అమ్మాయిలంటే అందంగానే ఉండాన్న ఆలోచన నుంచి ఈ సమాజం బయటకు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక నుంచైనా ఈ సంస్కృతి మారాలని సానియా ఆకాంక్షించారు. తన చిన్నతనంలో మహిళా క్రీడాకారుల్లో పీటీ ఉష ఒక్కరే కనిపించే వారని.. ఇప్పుడు సింధు, సైనా నేహ్వాల్, దీపా కర్మాకర్ వంటి స్టార్‌లు మహిళకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కాగా, 32 ఏళ్ల సానియా ఓ బిడ్డకు తల్లవడంతో ప్రస్తుతం టెన్నిస్‌ నుంచి బ్రేక్ తీసుకున్నారు. వచ్చే ఏడాది మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సాధన చేస్తున్నారు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...