WHEN MUMBAI INDIANS MEETS MANCHESTER UNITED SPORTS LOVER BRIDE GEET KHEDEKARS MEHENDI DESIGN GOES VIRAL IN SOCIAL MEDIA GH SRD
Viral News: ఒక్కటైన ముంబై ఇండియన్స్, మాంచెస్టర్ జట్లు.. ఎక్కడో తెలుసా?
Photo Credit : Twitter
Viral News : గీత ముంబయి ఇండియన్స్ జట్టుకు మద్దతు ఇస్తుంటే.. ఆమెకు కాబోయే భర్త దేవ్రాత్ మెయిన్హాలికర్ మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ వివాహం ద్వారా వారి కలయికను గుర్తు చేసే విధంగా..
మెహందీ.. మన భాషలో చెప్పాలంటే గోరింటాకు. వివాహ వేడుకల్లో తప్పనిసరిగా పెట్టుకొనే అలంకరణ ప్రక్రియ. ముఖ్యంగా మహిళలు మెహందీని ఎక్కువగా ఇష్టపడతారు. విభిన్న రకాలైన డిజైన్లతో గోరింటాకు పెట్టుకొని అందరిని ఆకర్షిస్తుంటారు. ఉత్తరాది వివాహ మహోత్సవాల్లో అయితే ఓ రోజంతా మెహందీకి కేటాయిస్తారు. ఈ రోజుల్లో తమ బంధాన్ని సూచించే విధంగా మెహందీ డిజైన్లు వేసుకుంటున్నారు. తాజాగా ఓ వధువు వైవిధ్యమైన డిజైన్‌లో గోరింటాకు పెట్టుకొని వార్తల్లో నిలిచింది. గీతా ఖడెకర్ అనే మహిళ ముంబయి ఇండియన్స్, మాంచెస్టర్ యునైటెడ్ జట్ల క్రీడా లోగోలను చేతిపై వేయించుకొంది. ఈ ఫొటో వైరల్ కావడంతో.. ముంబై ఇండియన్స్ టీమ్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దీన్ని పోస్ట్ చేసింది.
మెహందీని ఈ విధంగా క్రీడా జట్ల లోగోలతో పెట్టుకోవడానికి ఓ కారణముంది. గీత ముంబయి ఇండియన్స్ జట్టుకు మద్దతు ఇస్తుంటే.. ఆమెకు కాబోయే భర్త దేవ్రాత్ మెయిన్హాలికర్ మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ వివాహం ద్వారా వారి కలయికను గుర్తు చేసే విధంగా.. సరికొత్త మెహందీ డిజైన్‌ను గీత వేయించుకుంది. అంతేకాకుండా వారి ప్రేమ శాశ్వతంగా ఇదే విధంగా ఉండాలని సూచించింది. "ఈ మెహందీ మా హృదయం" అనే వాక్యాన్ని ఈ లోగోలో పొందుపరిచింది.
ఈ ఫొటోను తొలుత వధూవరులిద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అనంతరం ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సైతం దీన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో ఇన్ స్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలోనూ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ ఫొటోపై వినూత్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఔత్సాహికులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'నాకు కాబోయే భార్య ఈ విధంగా మెహందీ పెట్టుకోకపోతే.. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అని ప్రశ్నిస్తా' అని ఒక వ్యక్తి కామెంట్ రాశారు. ఇద్దరి అభిప్రాయాలను ఒకే స్పోర్ట్స్ లోగో డిజైన్‌లో పొందుపరిచిన వధువును చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తూ, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.