news18-telugu
Updated: November 26, 2020, 2:52 PM IST
Sachin Tendulkar was helped by an auto-rickshaw driver
దిగ్గజం క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌కు ఓ ఆటో డ్రైవర్ సహాయం చేశారు. మిలియనిర్ అయిన సచిన్‌కు ఆటోడ్రైవర్ సహాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా! అసలు జరిగింది ఏంటంటే.. సచిన్ ముంబయిలోని సబర్బన్ వీధుల్లో ప్రయాణిస్తుంది దారిని మర్చిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న తెందూల్కర్‌ను చూసిన ఓ ఆటో డ్రైవర్ సచిన్ సాయం చేశాడు. తను వెళ్ళాల్పిన రూటు వివరాలను తెలియజేశాడు. చివరికి అతని చేప్పిన దాని ప్రకారం తన గమ్యాన్ని చేరుకున్న సచిన్.. తనకు సాయం చేసిన ఆటోడ్రైవర్ని కలిసి మాట్లాడాడు. తర్వాత అతని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఓ సెల్ఫీ దిగాడు. అయితే ఈ సంఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినా సచిన్ ఇప్పుడు బయటపెట్టాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
"పెరుగుతున్న టెక్నాలజీ మనకెంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. నిజానికి మనిషి సాయానికి మించింది ఏదీ లేదు. ప్రస్తుతం మనం దాన్ని మార్చిపోయాం" అంటూ సచిన్ ఆ వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ పేరు మంగేశ్ అని సచిన్ తెలిపాడు. అతడితో మాట్లాడిన సన్నివేశం కూడా ఆ వీడియోలో ఉంది.సచిన్ సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిందే. పలు సామాజిక ఆంశాలను పేర్కొంటు పలు సందర్భాలలో పోస్ట్‌లు పెట్టిన విషయం తెలిసిందే. సచిన్ క్రికెట్‌కు ఆటకే వన్నె తెచ్చిన ఆటగాడు. తనదైన బ్యాటింగ్‌తో ప్రపంచంలోనే మేటి బౌలర్లకు చుక్కులు చూపించాడు. వేలాది పరుగులతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు. ఇక సచిన్ అంతర్జాతీయ క్రికెట్ అడుగుపెట్టి బుధవారంతో 31 ఏళ్లు పూర్తయ్యాయి.
Published by:
Rekulapally Saichand
First published:
November 26, 2020, 2:52 PM IST