• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • WHAT IS THE SECRET BEHIND IPL LOGO CRICKETER VIRENDRA SEHWAG REVEALED JNK

IPL 2021 : ఐపీఎల్ లోగో వెనుక అంత స్టోరీ ఉన్నదా? ఆ సీక్రెట్ ఏంటో చెప్పేసిన వీరేంద్ర సెహ్వాగ్

IPL 2021 : ఐపీఎల్ లోగో వెనుక అంత స్టోరీ ఉన్నదా? ఆ సీక్రెట్ ఏంటో చెప్పేసిన వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్ లోగో వెనుక సీక్రెట్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్ [PC : BCCI]

  • Share this:
    ఐపీఎల్ 2021 (IPL 2021) తొలి మ్యాచ్ ముగిసింది. ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనసాగించి మొదటి మ్యాచ్ ఓడిపోయింది. 160 పరుగుల వంటి తక్కువ స్కోర్‌ను ఛేజ్ చేయడానికి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టు ఆపసోపాలు పడింది. ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగడం విశేషం. ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందంటే కారణం ఏబీ డివిలియర్స్ (27 బంతుల్లో 48) (AB De Villiers) విధ్వంసకర బ్యాటింగ్ అనే చెప్పవచ్చు. హర్షల్ పటేల్ 5 వికెట్లు తీసి ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా.. డివిలియర్స్ కనుక లేకుంటే మ్యాచ్ చేజారి పోయేది. తనదైన శైలిలో రెచ్చిపోయిన ఏబీడీ గ్రౌండ్ నలువైపులా బంతిని పరుగులు పెట్టించాడు. అందుకే అతడిని మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. ఏబీడీ ఇన్నింగ్స్ చూసిన వీరేంద్ర సెహ్వాగ్ ఒక సరదా సీక్రెట్ చెప్పాడు. ఐపీఎల్ లోగో (IPL Logo) ఏబీ డివిలియర్స్‌ కొట్టే షాట్లలో ఒకదాన్ని చూసి డిజైన్ చేశారని అన్నాడు. విల్ పవర్ అంటే డివిలియర్స్ పవర్.. ఇది అన్ని పవర్స్‌ను ఓడిస్తుంది అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 'ఐపీఎల్ లోగోలో కనపడేది కచ్చితంగా డివిలియర్సే. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ సారి కప్ రావాల్సిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు' అని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

    సెహ్వాగ్ ట్విట్టర్ పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతడిని చూసి చాలా మంది డివిలియర్స్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని పొడుగుతూ పోస్టులు పెడుతున్నారు. మౌనిక అనే ట్విట్టర్ యూజర్.. ప్రతీ ఏడాది ఆర్సీబీకి డివిలియర్స్ ఒక సూపర్ మ్యాన్‌లా సహాయం చేస్తున్నాడని కామెంట్ చేసింది. మరోసారి ఏబీడీ రక్షకుడిగా మారిపోయాడని మరొకరు ట్వీట్ చేశారు. ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఏబీడీ రెడీగా ఉంటాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.





    కాగా, ఏబీడీ శుక్రవారం రాత్రి చేపాక్ స్టేడియంలో కేవలం 27 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. చివరి ఓవర్లో లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. కానీ అప్పటికే బెంగళూరు జట్టు విజయానికి చేరువైంది. మిగిలిన పరుగులు హర్షల్ పటేల్ కొట్టడంతో ఆర్సీబీ ఐపీఎల్ 2021ని విజయంతో ఆరంభించింది.
    Published by:John Naveen Kora
    First published:

    అగ్ర కథనాలు