Home /News /sports /

WHAT IS THE RELATION BETWEEN GANGULY AND NAGMA HOW GANGULY WIFE DONA REACTED THIS RELATION JNK

Ganguly-Nagma: గంగూలీ - నగ్మ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారా? ఆ ఫొటో చూసి సౌరవ్ భార్య డోనా ఏం చేసింది?

సౌరవ్ గంగూలీ - నగ్మ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారా? (PC: Twitter)

సౌరవ్ గంగూలీ - నగ్మ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారా? (PC: Twitter)

Ganguly-Nagma: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సినీ నటి నగ్మల మధ్య ప్రేమాయణం నడిచినట్లు అప్పట్లో మీడియాలో చాలా కాలం వార్తలు వచ్చాయి. అయితే వీరి ప్రేమాయణం గురించి తెలుసుకున్న గంగూలీ భార్య డోనా ఏం చేసిందో తెలిసిందా?

    క్రికెటర్లకు, సినీ తారలకు మధ్య ప్రేమ, పెళ్లి అనేవి చాలా కాలంగా మనం చూస్తున్నదే. ప్రస్తుతం బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు, మాజీ టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sauruv Ganguly) కూడా అలా ఒక నటి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయాడు. ఆమె ప్రముఖ నటి నగ్మ (Nagma). 1999 వరల్డ్ కప్ (World Cup) జరిగే సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా గంగూలీకి నగ్మ పరిచయం అయ్యింది. మొదటి చూపులోనే ప్రేమలో పడ్డా. వయసులో ఉన్న యువతీయువకులు ప్రేమలో పడటం చాలా కామన్. అయితే గంగూలీకి అప్పటికే డోనాతో పెళ్లైంది. తన చిన్న నాటి స్నేహితురాలు డోనాను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. డోనాతో ప్రేమ వివాహం జరిగిన రెండేళ్లకే గంగూలీ నగ్మాతో ప్రేమాయణం మొదలు పెట్టాడు. నగ్మ-గంగూలీ ప్రేమలో ఉన్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చేవి. కానీ డోనా సెలబ్రిటీలపై వార్తలు రావడం కామనే కదా అని తన చిన్ననాటి స్నేహితుడి మీద నమ్మకం ఉంచుకుంది.

    దక్షిణాదిలో అప్పటికే పాపులర్ హీరోయిన్ అయిన నగ్మతో కలసి ఒకసారి గంగూలీ రహస్యంగా తిరుపతి వెళ్లాడు. అయితే ఒక విలేకరి వారిద్దరి ఫొటో తీసి పత్రికలో ప్రచురించాడు. అంతే కాకుండా వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని జాతీయ మీడియాలో ఫొటోతో సహా వార్తలు ప్రచురించారు. దీంతో డోనా మనసు ముక్కలైపోయింది. తాను చిన్నప్పటి నుంచి నమ్మ, ప్రేమించిన స్నేహితులు ఇలా మోసం చేస్తాడా అని తట్టుకోలేకపోయింది. వెంటనే డోనా నోర్మూసుకొని కూర్చోలేదు. గంగూలీతో తాడోపేడో తేల్చుకోవాలని భావించింది.

    MS Dhoni: నా చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడతా.. కానీ అది ఎప్పుడో తెలియదు.. రిటైర్మెంట్‌పై ధోనీ వ్యాఖ్యలు


    వెంటనే భర్తను పిలిచి ఇవన్నీ రూమర్స్ అని మీడియాలో చెప్పు.. లేదంటే నాకు విడాకులు ఇచ్చెయ్ అని తేల్చి చెప్పింది. భార్య కోసం, స్థిరత్వం చూసిన గంగూలీ చాలా భయపడిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న డోనాను మోసం చేస్తున్నట్లు గ్రహించాడు. వెంటనే డోనాను క్షమించమని వేడుకున్నాడు. ఇకపై ఇలా చేయనంటూ బతిమాలుకున్నాడు. డోనా కూడా భర్తను క్షమించి ఇకపై ఇలాంటి ఆకర్షణల్లో పడొద్దని గట్టిగానే హెచ్చరించింది. గంగూలీ, డోనా ఇద్దరూ కలసి 'నగ్మాతో ఎలాంటి సంబంధ లేదు' అని మీడియాలో స్టేట్మెంట్ ఇచ్చారు.

    Double Hat-trick: దేశవాళీ క్రికెట్‌లో సంచలనం.. డబుల్ హ్యాట్రిక్ సాధించిన విదర్భ బౌలర్ దర్శన్ నల్కండే

    ఇక్కడి వరకు బాగానే ఉన్నది. కానీ నటి నగ్మ మనసు మాత్రం ముక్కలైంది. తనకు ఎన్నో మాటలు చెప్పి, ప్రేమ, పెళ్లి అని చెప్పిన గంగూలీ వెళ్లిపోవడంతో మనసు మొద్దుబారిపోయింది. గంగూలీని క్షమించేసి అతడికి ఇచ్చిన మాట ప్రకారం దూరంగా వెళ్లిపోయింది. నగ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. నగ్మ, గంగూలీ పెళ్లి జరిగిందో లేదో మాత్రం ఇప్పటికీ నిర్దారణ కాలేదు. అయితే ఆ రిలేషన్‌షిప్‌లో తాను చాలా బాధపడ్డానని..అది నరకాన్ని తలపించిందని నగ్మ చెప్పుకొచ్చింది. 'సావి' అనే పత్రికకు నగ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను అంతా చెప్పుకున్నది. అది నగ్మ-గంగూలీ లవ్‌స్టోరీ.
    Published by:John Kora
    First published:

    Tags: Bcci, Nagma, Sourav Ganguly, Team india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు