TikTokలో క్రికెట్ డాన్స్...వరల్డ్‌కప్ ఫీవర్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్

TikTok: క్రికెట్‌ను డాన్స్‌ని మిక్స్ చేసి కుర్రకారు దుమ్ము దులిపేస్తున్నారు. ఇంకాస్త కామెడీని కూడా యాడ్‌చేసి నెట్టింట్లో ఇరదీస్తున్నారు.

news18-telugu
Updated: June 3, 2019, 12:41 PM IST
TikTokలో క్రికెట్ డాన్స్...వరల్డ్‌కప్ ఫీవర్‌తో ఊగిపోతున్న ఫ్యాన్స్
టిక్‌టాక్‌లో క్రికెట్ ఫ్యాన్స్ డ్యాన్స్
  • Share this:
మనదేశంలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానముంది. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ ఫైట్ వరకు ప్రతి మ్యాచ్‌నూ సెలబ్రేట్‌ చేసుకుంటారు ఇండియన్స్. మొన్నటి వరకు ఐపీఎల్ సిక్సుల్లో తడిసి ముద్దయిన భారత్.. ఇప్పుడు వరల్డ్ కప్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. ప్రపంచకప్‌ను పండగలా జరపుకుంటున్నారు ఫ్యాన్స్. ట్విటర్, ఫేస్‌బుక్..ఇలా ఎక్కడ చూసినా క్రికెట్ గోలే..! ఇక టిక్‌టాక్‌లో డ్యాన్స్‌లు, పాటలతో హోరెత్తిస్తున్నారు క్రికెట్ లవర్స్. ప్రపంచ కప్ నేపథ్యంలో తమ క్రియేటివిటీకి పదునుపెట్టి..క్రికెట్‌కు ముడిపెట్టి.. వెరైటీ వీడియోలు రూపొందిస్తున్నారు.

టిక్ టాక్ యాప్‌లో #CricketWorldCup హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. టీమిండియాకు మద్దతు తెలుపుతే ఏక్ కప్ ఔర్, బ్రింగ్ ది కప్ బ్యాక్ హోమ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. క్రికెట్‌కు సంబంధించి దాదాపు లక్ష వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. క్రికెట్‌ను డాన్స్‌ని మిక్స్ చేసి కుర్రకారు దుమ్ము దులిపేస్తున్నారు. ఇంకాస్త కామెడీని కూడా యాడ్‌చేసి నెట్టింట్లో ఇరదీస్తున్నారు. వాటిలో కొన్ని వీడియోలు మీ కోసం...

టిక్‌టాక్‌లో ఈ పాటకు క్రికెట్ ఫ్యాన్స్ చేసే ఫన్నీ విన్యాసాలు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.







ఇండియన్స్‌ని కింగ్స్ ఆఫ్ జుగాడ్ అని ఎందుకంటారంటే..ఇందుకే..!
ఈ కుర్రాడు తన కంటే బాగా క్యాచ్ పట్టాడని బెన్ స్టోక్స్ ఒప్పుకొని తీరాల్సిందే..!


బాలీవుడ్ మీరు వింటున్నారా..?


క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూసి టిక్ టాక్ కొత్త ఛాలెంజ్ తీసుకొచ్చింది. అసలు గేమ్స్ అంటే ఏంటి? దాని వల్ల ఉపయోగాలేంటన్న దానిపై వీడియోలు చేసి షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన యూజర్లు టీమిండియా మ్యాచ్‌లను చూసే అవకాశం పొందుతారు.
First published: June 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు