Home /News /sports /

WHAT HAPPENED TO BOWLER ISHANT SHARMA IS HE FACING ANY FITNESS PROBLEMS PACER MOHAMMAD SHAMI ANSWERED JNK

Ishant Sharma Fitness: ఇషాంత్ శర్మకు ఏమైంది? అతడి ఫిట్‌నెస్‌పై టీమ్ ఇండియా ఏమైనా దాచిపెడుతోందా?

ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడా? (PC: BCCI)

ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడా? (PC: BCCI)

మూడో టెస్టు రెండో రోజు భారత జట్టు పేసర్ ఇషాంత్ శర్మ 22 ఓవర్లు వేసి 92 పరుగులు ఇచ్చాడు. లాంగ్ స్పెల్స్ కాకుండా 2 నుంచి 3 ఓవర్ల షార్ట్ స్పెల్స్‌కు పరిమితం అయ్యాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    లీడ్స్‌లోని హెడింగ్లే వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో (Test Match) భారత జట్టు (Team India) పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. తొలి రోజు బ్యాటుతో విఫలమైన జట్టు.. రెండో రోజు పసలేని బౌలింగ్‌తో ఇంగ్లాండ్ జట్టుకు (England Team) భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. కెప్టెన్ జో రూట్ (Joe Root) మరో సెంచరీతో రాణించడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 340 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. రెండో టెస్టులో రెండు సెషన్లలోనే 10 వికెట్లు పడగొట్టిన భారత పేసర్లు.. మూడో టెస్టులో మాత్రం రోజంతా కష్టపడినా 8 వికెట్లు మాత్రమే తీయగలిగారు. మరోవైపు భారత జట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కనీసం ఒక్క వికెట్ కూడా తీయకుండా 92 పరుగులు ఇచ్చాడు. రోజంతా కలిపి ఇషాంత్ శర్మ మొత్తం 22 ఓవర్లు వేశాడు. అయితే ఇషాంత్ శర్మ (Ishant Sharma) కేవలం 3 నుంచి 4 ఓవర్ల షాట్ స్పెల్స్ మాత్రమే వేశాడు. రోజంతా చిన్న చిన్న స్పెల్స్ వేసుకుంటూ భారీగా పరుగులు ఇచ్చాడు. దీంతో మరోసారి ఇషాంత్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు ఫిట్‌గా లేకపోవడం వల్లే కోహ్లీ అతడితో లాంగ్ స్పెల్స్ వేయించలేదనే వార్తలు బయటకు వచ్చాయి. మరోవైపు మహ్మద్ షమీ కాస్త పర్వాలేదనిపించాడు. అతడు మూడు కీలకమైన వికెట్లు తీసి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన షమి (Mohammad Shami).. ఇషాంత్ ఫిట్‌నెస్‌పై వస్తున్న రూమర్లను ఖండించాడు.

    'మనం బంతితో సరిగా రాణించని సమయంలో కెప్టెన్లు బౌలర్లకు చిన్న స్పెల్స్ ఇవ్వడం అనేది సాధారణమైన విషయమే. రోజంతా ఫీల్డ్ లో ఉండాల్సిన సమయంలో బౌలర్లకు కొన్ని ఓవర్లు మాత్రమే వరుసగా వేయడానికి కెప్టెన్లు అనుమతి ఇస్తుంటారు. ఒక వేళ మనం నిలకడగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీసే సమయంలో వరుసగా 7 నుంచి 8 వోవర్ల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా కెప్టెన్ తీసుకునే నిర్ణయమే. బౌలర్లు మంచి రిథమ్‌లో ఉన్నప్పుడు వారిని తప్పించడానికి కెప్టెన్లు కూడా సాహసించరు. ఏదేమైనా జట్టంతా కెప్టెన్ చెప్పినట్లు వినాల్సిందే. మీరు అనుకుంటున్నట్లు ఇషాంత్ శర్మ ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కోవడం లేదు. గురువారం రోజు ఇషాంత్ బౌలింగ్ ప్రారంభించాడు. చివరిలో ఓవర్లు పూర్తి చేసింది కూడా ఇషాంతే. కేవలం కోహ్లీ ఆజ్ఞ ప్రకారం చిన్న స్పెల్స్ వేశాడు' అని మహ్మద్ షమీ ప్రెస్‌కు వివరించాడు.





    ఇక షమీ మూడో టెస్టు గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మేమేం తలదించుకోవడం లేదు. ఇంకా మూడు రోజుల మ్యాచ్ మిగిలి ఉన్నది. భారత జట్టుకు మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉంది. మా బ్యాట్స్‌మెన్ గతంలో కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించారు. ఇండియాకు ముందు మంచే జరుగనున్నదని షమీ చెప్పాడు. ప్రస్తుతం పిచ్ చూస్తే బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినట్లు కనపడుతున్నది. మేం తలదించుకోవల్సినంత పరిస్థితుల్లో ఏమీ లేము.. మేము మిగతా మ్యాచ్ అంతా తలెత్తుకొనే ఆడతాము అని షమీ చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసే అవకాశం ఇండియాకు ఉన్నదని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: India vs england, Team india, Test Cricket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు