హోమ్ /వార్తలు /క్రీడలు /

Cricket: ఇంగ్లాండ్ స్టేడియంలలో ప్రేక్షకుల చెవులకు ఆ పరికరాలేమిటి? దీని వెనుక స్టోరీ ఏమై ఉంటుంది?

Cricket: ఇంగ్లాండ్ స్టేడియంలలో ప్రేక్షకుల చెవులకు ఆ పరికరాలేమిటి? దీని వెనుక స్టోరీ ఏమై ఉంటుంది?

ఇంగ్లాండ్ ప్రేక్షకుల చెవుల్లో ఆ ఎర్రని పరికరాలు ఏమిటి? (PC: Sky Sports)

ఇంగ్లాండ్ ప్రేక్షకుల చెవుల్లో ఆ ఎర్రని పరికరాలు ఏమిటి? (PC: Sky Sports)

ఇంగ్లాండ్ స్టేడియంలో ప్రేక్షకులు చెవులకు పెట్టుకునే మెషిన్లు ఏమిటో తెలుసా? అవి ఎందుకు ధరిస్తారు? వాటి వల్ల ఉపయోగం ఏమిటంటే..

  భారత జట్టు (Team India) ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో (England tour) పర్యటిస్తున్నది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు (First Test) నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో జరిగింది. భారత జట్టు విజయానికి చేరువుగా వచ్చినా.. చివరి రోజు ఒక్క బంతి పడకుండా ఆట రద్దయ్యింది. దీంతో ఇంగ్లాండ్-ఇండియా టెస్టు డ్రాగా (Match Drawn) ముగిసినట్లు ప్రకటించారు. అయితే.. ఈ నాలుగు రోజులు టెస్టును టీవీల్లో వీక్షించిన వారు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న చాలా మంది ప్రేక్షకులు చెవులకు ఎరుపు రంగు మెషిన్లు (Gadgets) ధరించి కనపడ్డారు. అటూ ఇటూ తిరుగుతూ చెవులకు ఆ మిషన్లు పెట్టుకొని సందడి చేశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ సపోర్టర్స్ ఈ ఎర్ర రంగు పరికరాలు ధరించి కనిపించారు. దీంతో ఇంతకు ఈ మెషిన్లు ఏమిటనే సందేహం అందరికీ వచ్చింది. అవేమైనా చెవిటి మెషిన్లేమో అని నెటిజన్లు కూడా కొంత మంది కామెంట్లు చేశారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

  స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌లు చూసే వారికి అసలు అక్కడ ఏం జరుగుతున్నదో సరిగా అర్దం కాదు.  ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు కాస్త బంతి కనపడుతుంది. కానీ టెస్టు మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సులు అనేవి ఎప్పటికో గాని బ్యాట్స్‌మాన్ కొట్టరు. కానీ పిచ్ మధ్యలోమ్యాచ్ జరుగుతున్నా.. అక్కడ దూరంగా కూర్చొన్న ప్రేక్షకులకు మాత్రం ఏమీ అర్దం కాదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రేక్షకులు తమ చెవులకు చిన్న రేడియోలను పెట్టుకుంటారు. లోకల్ రేడియో స్టేషన్‌లో క్రికెట్ కామెంట్రీని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. టీవీ ప్రసారాలు అందించే స్కై స్పోర్ట్స్ నెట్‌వర్కే ఈ రేడియో ప్రసారాలు కూడా అందిస్తున్నది. దీంతో స్టేడియంలో ఉండే ప్రేక్షకులు అక్కడ ఏం జరుగుతుందో కామెంట్రీ రూపంలో వినే అవకాశాన్ని కల్పిస్తారు. దానికి ఆ చిన్న పరికరాలు ఎందుకు? ఫోన్‌లో రేడియో ఆన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావొచ్చు! అవును. కానీ ఆ రేడియో ప్రసారాలు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. లేదంటే స్కై స్పోర్ట్స్ అందించే ఆ స్పెషల్ గాడ్జెట్స్ కొనుక్కొని వినాలి. అందుకే ప్రేక్షకులు అలా చెవులకు రేడియోలు పెట్టుకొని కనపడుతుంటారు.

  Neeraj Chopra: మీ పేరు నీరజ్.. అయితే ఈ బంపర్ ఆఫర్లు మీ కోసమే.. ఉచిత పెట్రోల్.. ఫ్రీ రైడ్స్.. అబ్బో ఆఫర్లే ఆఫర్లు

  కేవలం క్రికెట్‌ మ్యాచ్‌ల సమయంలోనే కాకుండా రగ్బీ, ఫుట్‌బాల్, హార్స్ రేసింగ్‌లలో కూడా ఈ మినీ రేడియోలను విస్తృతంగా వాడుతుంటారు. మ్యాచ్‌లో ఏం జరుగుతున్నదో అప్పటికప్పుడు తెలుసుకోవడానికే ప్రేక్షకులు ఇలా రేడియోలు ఉపయోగిస్తుంటారు.

  Published by:John Kora
  First published:

  Tags: Cricket, India vs england, Sky sports, Team India

  ఉత్తమ కథలు