వెల్కమ్ టు వెస్టిండీస్‌..టీ20 వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధం

"వెల్కమ్ టు వెస్టిండీస్...వెల్కమ్ టు వరల్డ్‌కప్" అని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) 2018 ఉమెన్స్ వరల్డ్ కప్‌ కోసం ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: November 8, 2018, 5:45 PM IST
వెల్కమ్ టు వెస్టిండీస్‌..టీ20 వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధం
2018 మహిళల టీ20 వరల్డ్ కప్ ( Twitter Images )
news18-telugu
Updated: November 8, 2018, 5:45 PM IST
ఉమెన్స్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్‌కు వెస్టిండీస్‌లో సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో కరీబియన్ దీవుల్లో మహిళల మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇప్పటివరకూ పురుషుల టీ 20 ప్రపంచకప్‌తో పాటే నిర్వహించే ఉమెన్స్ ప్రపంచకప్‌ టోర్నీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) తొలిసారిగా విడిగా నిర్వహిస్తోంది. గతేడాది చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌కే 6వ టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిధ్యమిస్తుంది. ఈ టోర్నీలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగనుంది. ఇప్పటివరకూ ఒక్క సారి కూడా ట్వంటీ ట్వంటీ వరల్డ్ ట్రోఫీని ముద్దాడలేకపోయిన టీమిండియా ఈ సారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.

నవంబర్ 9 నుంచి ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. 6వ మహిళల టీ20 మహాసంగ్రామానికి వెస్టిండీస్ దీవులు ఆతిధ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ కోసమే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ) ప్రత్యేకంగా ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది. "వెల్కమ్ టు వెస్టిండీస్...వెల్కమ్ టు వరల్డ్‌కప్" అనే క్యాప్షన్‌తో ఓ వీడియో రిలీజ్ చేసింది. అన్ని జట్లకు చెందిన స్టార్ క్రికెటర్స్‌ ఈ వీడియోలో స్టెప్పులేసి సందడి చేశారు.


2009లో ఐసీసీ తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో ఉమెన్స్ వరల్డ్‌కప్ నిర్వహించింది. 2009 నుంచి 2016 వరకూ ఐదు ఉమెన్స్ వరల్డ్ టీ20 టోర్నీల్లో ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన ఘనత మూడు జట్లకే దక్కింది.

2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను చార్లెట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన మూడు టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ టైటిల్స్‌తో హిస్టరీ క్రియేట్ చేసింది. 2010,2012,2014 టోర్నీల్లో కంగారూటీమ్ వరుసగా మూడు టైటిల్స్ సాధించి చరిత్రను తిరగరాసింది.
Loading...
2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో కరీబియన్ టీమ్ పెద్ద సంచలనమే సృష్టించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియానే ఓడించి వెస్టిండీస్ జట్టు తొలి సారిగా టీ20 విశ్వవిజేతగా నిలిచింది.

మొత్తం 10 జట్లు ట్వంటీ ట్వంటీ వరల్డ్ చాంపియన్‌షిప్ రేస్‌లో ఉన్నాయి. మూడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియా, 2016 టోర్నీ చాంపియన్ వెస్టిండీస్ జట్లతో పాటు భారత జట్టు హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.


First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...