హోమ్ /వార్తలు /క్రీడలు /

Ajinkya Rahane: 'చేసిన అతి చాలు.. మైదానం నుంచి బయటకు పో '.. ఆ యంగ్ క్రికెటర్ ని బయటకు పంపిన రహానే..

Ajinkya Rahane: 'చేసిన అతి చాలు.. మైదానం నుంచి బయటకు పో '.. ఆ యంగ్ క్రికెటర్ ని బయటకు పంపిన రహానే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Ajinkya Rahane: దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌లో మితిమీరిన స్లెడ్జింగ్‌తో వార్తల్లో నిలిచాడు వెస్ట్‌జోన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌. ఆదివారం సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతని ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన కెప్టెన్‌ ఆజింక్య రహానే.. అతన్ని ఫీల్డ్ నుంచి బయటకు పంపాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

క్రికెట్‌ (Cricket)లో ఆటగాళ్లను స్లెడ్జింగ్‌ (Sledging) చేయడం సాధారణం. మితిమీరిన స్లెడ్జింగ్‌తో వివాదాస్పదమైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. క్రికెట్‌ నియమాల ప్రకారం జరిమానాలు, మ్యాచ్‌ నిషేధాలు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. తాజాగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ (Duleep Trophy Final)లో మితిమీరిన స్లెడ్జింగ్‌తో వార్తల్లో నిలిచాడు వెస్ట్‌జోన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal). ఆదివారం సౌత్‌జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అతని ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన కెప్టెన్‌ ఆజింక్య రహానే.. (Ajinkya Rahane) ఏకంగా జైస్వాల్‌ను ఫీల్డ్‌ నుంచి బయటకు వెళ్లమని ఆదేశించాడు. దీంతో జైస్వాల్‌ ఏడు ఓవర్ల వరకు మైదానం వీడాడు.

దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ తీరు వివాదాస్పదమైంది. సౌత్ జోన్ ఆటగాడు రవితేజను స్లెడ్జింగ్ చేస్తూ విరక్తి తెప్పించడంతో వెస్ట్ జోన్ కెప్టెన్ అజింక్య రహానే జైస్వాల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాడు. ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లాలని అతడిని ఆదేశించాడు. స్లెడ్జింగ్‌ శ్రుతిమించుతోందని రవితేజ ఫిర్యాదు చేయడంతో రహానే ఇలా చర్యలు తీసుకున్నాడు. జైస్వాల్‌ స్లెడ్జింగ్‌ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అయింది.

* రవితేజ, జైస్వాల్‌ మధ్య వాగ్వాదం

ఆఖరి ఇన్నింగ్స్‌లో 50వ ఓవర్‌లో జైస్వాల్, తేజ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రహానే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశాడు. 57వ ఓవర్‌లో జైస్వాల్ మళ్ళీ రవితేజను ఉద్దేశించి కొన్ని మాటలు అన్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ అతని గురించి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రహానే, జైశ్వాల్‌తో మాట్లాడి మైదానం వీడాల్సిందిగా ఆదేశించాడు. ఏడు ఓవర్లపాటు ఫీల్డ్‌ను వీడిన జైస్వాల్ ఆ తర్వాత తిరిగి వచ్చాడు.

* ప్రత్యర్థులను గౌరవించాలి

మ్యాచ్ అనంతరం.. జైస్వాల్‌ను బయటకు పంపే తన నిర్ణయాన్ని రహానే వివరించాడు. నియమాలను పాటించడం, తోటి ఆటగాళ్లను గౌరవించడం ముఖ్యమని భావిస్తానని స్పష్టం చేశాడు. క్రికెట్‌లో అందరూ నిబంధనలు పాటించాలని, ఆటను, ప్రత్యర్థులను, అంపైర్లను గౌరవించాలని చెప్పాడు. తాను క్రికెట్‌ ఆడే విధానం ఇలాగే ఉంటుందని, మైదానంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఫీల్డ్‌లో అందరినీ గౌరవించాలని, లేదంటే బయటకు రావాలని రహానే చెప్పాడు.

* 285 పరుగులు చేసిన జైస్వాల్‌

యశస్వి జైస్వాల్‌ మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. తాను క్రికెట్‌లో ముందుకు వెళ్లడంపై దృష్టి పెట్టానని చెప్పాడు. సీనియర్లు రహానే, శ్రేయస్ అయ్యర్‌ సలహాలు తీసుకుంటున్నట్లు చెప్పాడు. అయితే వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలిచిన జైస్వాల్ ఫైనల్‌లో బ్యాటింగ్‌లో రాణించాడు.

కోయంబత్తూరులో సౌత్ జోన్‌పై 294 పరుగుల తేడాతో గెలిచి వెస్ట్‌ జోన్‌ రికార్డు విజయం సొంతం చేసుకుంది. ఇది వెస్ట్‌ జోన్‌కు 19వ దులీప్ ట్రోఫీ టైటిల్‌. టోర్నమెంట్‌లో జైస్వాల్‌ 285 పరుగులు చేశాడు. రహానే కూడా టోర్నమెంట్‌లో సత్తా చాటాడు. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 62 సగటుతో మూడు మ్యాచ్‌లలో 250 పరుగులు చేశాడు. ఇందులో అజేయంగా 207 పరుగులు కూడా ఉన్నాయి. వెస్ట్ జోన్‌ను అద్భుతమైన సిరీస్‌లో విజేతగా నిలపడం ఆనందంగా ఉందని పేర్కొంటూ రహానే ట్వీట్‌ చేశాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Cricket, Team India, Viral Video

ఉత్తమ కథలు