WI vs Pak: విండీస్ చేతిలో పాక్ చిత్తు... 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసిన వెస్టిండీస్...

WI vs Pak: ఏడు వికెట్ల తేడాతో పాక్ చిత్తు... వన్డేల్లో వరుసగా ఆరో హాఫ్ సెంచరీ నమోదుచేసిన క్రిస్‌గేల్... 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన విండీస్..

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 6:51 PM IST
WI vs Pak: విండీస్ చేతిలో పాక్ చిత్తు... 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసిన వెస్టిండీస్...
విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గ్రేల్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 6:51 PM IST
West Indies vs Pakistan Live Score, ICC World Cup 2019 Cricket Match at Trent Bridge: వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విండీస్ అద్భుత విజయం సాధించింది. పాక్ ఘోర పరాజయంతో వరల్డ్‌కప్‌ను ప్రారంభించింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్...3 వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే టార్గెట్‌ను చేధించారు. విండీస్ బౌలర్లు పాక్‌ను 21.4 ఓవర్లలో ఆలౌట్ చేస్తే... బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే చేధించడం మొత్తంగా 35.2 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ ముగిసింది. విండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్‌గేల్ అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా... నికోలస్ పూరన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్ష్యం మరీ చిన్నది కావడంతో విండీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశారు. 4.3 ఓవర్లలోనే 36 పరుగులు రాబట్టారు. ఈ దశలో భారీ షాట్‌కు ప్రయత్నించిన షాయ్ హోప్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారెన్ బ్రావో డకౌట్ కాగా... 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్రిస్‌గేల్... తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్, హెట్మయర్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు. నికోలస్ పూరన్ 34 పరుగులు చేయగా, హెట్మయర్ 7 పరుగులు చేశాడు. విండీస్ కోల్పోయిన 3 వికెట్లు మహ్మద్ అమీర్‌కే దక్కడం విశేషం. 30 జనవరి 2019 నుంచి పాకిస్థాన్ జట్టు ఒక్క వన్డే మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోవడం విశేషం. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఆఫ్ఘనిస్థాన్ చేతిలో పాక్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. నాలుగు వికెట్లు తీసి, పాక్ పతనంలో కీలక పాత్ర పోషించిన ఒసానే థామస్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన 74 ఆలౌట్ తర్వాత వరల్డ్‌కప్‌లో పాక్ అత్యల్ప స్కోరు ఇదే...


వన్డేల్లో క్రిస్‌గేల్‌కు ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. వరుసగా 50+ స్కోర్లు నమోదుచేసిన రెండో క్రికెటర్‌గా పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందద్ (9 హాఫ్ సెంచరీలు) తర్వాతి స్థానంలో రాస్ టేలర్, కేన్ విలియంసన్ వంటి ఆరుగురు క్రికెటర్ల రికార్డును సమం చేశాడు క్రిస్ గేల్. ఇంతకుముందు రాస్‌ టేలర్, కేన్ విలియంసన్, మార్క్ వోగ్, మహ్మద్ యూసఫ్, ఆండ్రూ జోన్స్, జోర్డాన్ గ్రీనిడ్జ్... వరుసగా 6 హాఫ్ సెంచరీలు నమోదుచేశారు.

world cup 2019 WI vs PAK, Pak vs WI, chris gayle, andre russel, west indies vs Pakistan Worldcup 2019, Eng vs SA, england vs South Africa worldcup 2019,world cup, cricket 2019, world cup cricket 2019, world cup cricket, world cup 2019 team, icc, india world cup 2019, icc 2019 world cup, icc world cup, world cup schedule, 2019 world cup schedule, 2019 world cup squad, world cup 2019 list, india world cup team 2019, 2019 world cup, indian team, 2019 world cup teams, Live Cricket Streaming, icc cricket world cup live, Cricket World Cup Tournament, Live cricket score, Cricket news, Cricket updates, Hotstar live, వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్‌కప్ లైవ్ స్కోరు, ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా
వికెట్ తీసిన ఆనందంలో విండీస్ ప్లేయర్స్



అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టుగా పెవిలియన్ చేరుతుండడం... పాక్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విండీస్ బౌలర్లు ఓ ఆటాడుకోవడంతో 50 ఓవర్ల మ్యాచ్ కాస్తా టీ20 మ్యాచ్‌లా మారిపోయింది. వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ కూడా ‘వన్ ఆఫ్ ది ఫెవరెట్’ జట్లు అని మాట్లాడిన పాక్ సపోర్టర్లకు షాక్ ఇచ్చేలా సాగింది దాయాది బ్యాటింగ్. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి మూడు ఓవర్ల పాటు కుదురుగా సాగిన పాక్ బ్యాటింగ్ ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఫకార్ జమాన్ 22 పరుగులు, హరిస్ సోహైల్ 8, బాబర్ అజామ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆదుకుంటాడనుకున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా 8 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇమాద్ వసీమ్ 1 పరుగుకు అవుట్ కాగా షాదబ్ కాన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత హసన్ అలీ 1, మహ్మద్ హాఫీజ్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 83 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది పాక్. అయితే వాహబ్ రియాజ్ విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి... జాసన్ హోల్డర్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు ఓ ఫోర్ కొట్టి పాక్ స్కోరు 100+ మార్కు దాటించాడు. అయితే 18 పరుగులు చేసిన వాహబ్ రియాజ్‌ను థామస్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఒసానే థామస్‌కు నాలుగు వికెట్లు దక్కగా విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రే రస్సెల్‌కు రెండు వికెట్లు దక్కగా... షెల్డర్ కాట్రెల్‌కు ఓ వికెట్ దక్కింది.
First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...