WI vs PAK: విండీస్ బౌలర్ల విశ్వరూపం... 105 పరుగులకే పాక్ ఢమాల్...

WI vs PAK: ఒసానే థామస్‌కు నాలుగు వికెట్లు, జాసన్ హోల్డర్‌కు మూడు వికెట్లు... విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన పాక్ బ్యాటింగ్ లైనప్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 31, 2019, 6:07 PM IST
WI vs PAK: విండీస్ బౌలర్ల విశ్వరూపం... 105 పరుగులకే పాక్ ఢమాల్...
WI vs PAK: ఒసానే థామస్‌కు నాలుగు వికెట్లు, జాసన్ హోల్డర్‌కు మూడు వికెట్లు... విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిన పాక్ బ్యాటింగ్ లైనప్...
  • Share this:
West Indies vs Pakistan Live Score, ICC World Cup 2019 Cricket Match at Trent Bridge: వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టుగా పెవిలియన్ చేరుతుండడం... పాక్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విండీస్ బౌలర్లు ఓ ఆటాడుకోవడంతో 50 ఓవర్ల మ్యాచ్ కాస్తా టీ20 మ్యాచ్‌లా మారిపోయింది. వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ కూడా ‘వన్ ఆఫ్ ది ఫెవరెట్’ జట్లు అని మాట్లాడిన పాక్ సపోర్టర్లకు షాక్ ఇచ్చేలా సాగింది దాయాది బ్యాటింగ్. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్... ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి మూడు ఓవర్ల పాటు కుదురుగా సాగిన పాక్ బ్యాటింగ్ ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా ఫకార్ జమాన్ 22 పరుగులు, హరిస్ సోహైల్ 8, బాబర్ అజామ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆదుకుంటాడనుకున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా 8 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇమాద్ వసీమ్ 1 పరుగుకు అవుట్ కాగా షాదబ్ కాన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత హసన్ అలీ 1, మహ్మద్ హాఫీజ్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 83 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది పాక్. అయితే వాహబ్ రియాజ్ విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి... జాసన్ హోల్డర్ వేసిన ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు ఓ ఫోర్ కొట్టి పాక్ స్కోరు 100+ మార్కు దాటించాడు. అయితే 18 పరుగులు చేసిన వాహబ్ రియాజ్‌ను థామస్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై సాధించిన 74 ఆలౌట్ తర్వాత వరల్డ్‌కప్‌లో పాక్ అత్యల్ప స్కోరు ఇదే...


ఒసానే థామస్‌కు నాలుగు వికెట్లు దక్కగా విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రే రస్సెల్‌కు రెండు వికెట్లు దక్కగా... షెల్డర్ కాట్రెల్‌కు ఓ వికెట్ దక్కింది.
Published by: Ramu Chinthakindhi
First published: May 31, 2019, 5:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading