West Indies vs India : వెస్టిండీస్ టూర్‌కి బయల్దేరిన టీమిండియా

West Indies vs India : భారత్‌కు వరల్డ్ ‌కప్‌ దక్కలేదన్న నిరాశలో ఉన్న క్రికెట్ అభిమానులు... ఆ బాధను మర్చిపోయేందుకు టీమిండియా... వెస్టిండీస్ టూర్ ఉపయోగపడబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 29, 2019, 6:29 AM IST
West Indies vs India : వెస్టిండీస్ టూర్‌కి బయల్దేరిన టీమిండియా
టీమిండియా (Image : Twitter)
  • Share this:
Team India West Indies Tour : మూడు వన్డేలు, రెండు టెస్టులు, మూడు టీ-ట్వంటీలు ఆడేందుకు టీమిండియా ఉదయం ఆరు గంటలకు వెస్టిండీస్ టూర్‌కి బయల్దేరింది. ఈ టూర్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్తున్నాడు. అతను వెళ్లడం లేదనీ, అతనికి BCCI విశ్రాంతి ఇస్తోందనీ పుకార్లు షికార్లు చేశాయి. అది నిజం కాదని తేలిపోయింది. సెలక్షన్ కమిటీ కోహ్లీని ఎంపిక చేసింది. అందువల్ల కోహ్లీ కూడా టూర్‌కి వెళ్తున్నాడని స్పష్టమైంది. మరోవైపు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ టూర్‌కి వెళ్లడం లేదు. ఇందుకు వ్యక్తిగత అంశాలే కారణమని తెలుస్తోంది. తాను అందుబాటులో ఉండడం లేదని ధోనీ ప్రకటించడంతో... మూడు ఫార్మాట్స్‌లోనూ ధోనీ ప్లేస్‌లో రిషభ్ పంత్ వికెట్‌ కీపర్‌గా ఉండబోతున్నాడు.

చేతి బొటన వేలికి గాయం కావడంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ టూర్‌లో టీ-20, వన్డేలు ఆడతాడు. ఈ రెండు ఫార్మాట్స్‌కీ పేసర్ జస్‌ ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఎలా చూసినా ఈ టూర్‌లో టీమిండియానే ఫేవరెట్ జట్టుగా కనిపిస్తోంది. భారత్‌కు వరల్డ్ ‌కప్‌ దక్కలేదన్న నిరాశలో ఉన్న క్రికెట్ అభిమానులు... ఆ బాధను మర్చిపోయేందుకు టీమిండియా... వెస్టిండీస్ టూర్ ఉపయోగపడబోతోంది.
First published: July 29, 2019, 6:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading