హోమ్ /వార్తలు /క్రీడలు /

WI vs BAN : కేవలం 13.. ఏందీ బంగ్లాదేశ్ ఇదీ.. ప్రత్యర్థికి మరీ ఇంత చీప్ టార్గెట్ ఇచ్చావేంటి..

WI vs BAN : కేవలం 13.. ఏందీ బంగ్లాదేశ్ ఇదీ.. ప్రత్యర్థికి మరీ ఇంత చీప్ టార్గెట్ ఇచ్చావేంటి..

PC : ICC

PC : ICC

WI vs BAN : రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ (Bangladesh)ను వెస్టిండీస్ (West Indies) చావు దెబ్బ తీసింది. వెస్టిండీస్ తో జరిగిన రెండవ టెస్టులోనూ బంగ్లాదేశ్ ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ఇంకా చదవండి ...

WI vs BAN : రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ (Bangladesh)ను వెస్టిండీస్ (West Indies) చావు దెబ్బ తీసింది. వెస్టిండీస్ తో జరిగిన రెండవ టెస్టులోనూ బంగ్లాదేశ్ ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఓవర్ నైట్ స్కోరు 132/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 45 ఓవర్లలో 186 పరుగులు మాత్రచే చేసి ఆలౌటైంది. నురుల్ హసన్ (60), నజ్బుల్ సాంటో (42) మాత్రమే ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, అల్జారీ జోసెఫ్, సీల్స్ తలా మూడు వికెట్లు తీశారు. దాంతో బంగ్లాదేశ్ ప్రత్యర్థి ముందు కేవలం 13 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఉంచగలిగింది. ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 2.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసి గెలుపును అందుకుంది. కెప్టెన్ బ్రాత్ వైట్ (4 నాటౌట్), జాన్ క్యాంప్ బెల్ (9 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.

ఇది కూడా చదవండి  : ఈసారైనా సరిగ్గా ఆడు.. లేదంటే నిన్ను ఎవరు దేకను కూడా దేకరు చూడు

రెండో టెస్టులోనూ విజయం సాధించడంతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0తో వెస్టిండీస్ కైవలం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 64.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (53), తమీమ్ ఇక్బాల్ (46) మాత్రమే ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో సీల్స్, అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఫిలిప్, కైల్ మేయర్స్ చెరో రెండు వికెట్లు తీశారు.


అనంతరం బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 126.3 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. కైల్ మేయర్స్ (146) శతకంతో కదంతొక్కాడు. అతడికి కెప్టెన్ బ్రాత్ వైట్ (51), జాన్ క్యాంపెబెల్ (45), బ్లాక్ వుడ్ (40)ల నుంచి సహకారం అందడంతో విండీస్ జట్టుకు భారీ స్కోరు లభించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అహ్మద్ 5 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ 3.. ఇస్లామ్ 2 వికెట్లు సాధించారు. దాంతో వెస్టిండీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 186 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోగలిగింది.

First published:

Tags: Bangladesh, ICC, India vs england, Rohit sharma, Team India, Virat kohli, West Indies

ఉత్తమ కథలు