Home /News /sports /

WEST INDIES STAR FABIAN ALLEN LOOKS LIKE A SUPER MAN BROTHER FOR HIS STUNNING FIELDING EFFORTS SRD

Viral Video : ఏంటయ్యా అలెన్..సూపర్ మ్యాన్ అన్నలా ఉన్నావ్..మొన్న అలా..నిన్న ఇలా క్యాచ్ లు పట్టావ్..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : క్రికెట్ అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి.

ఇంకా చదవండి ...
  క్రికెట్ అంటేనే ఓ అద్భుతం అంటారు.. అందులోనూ ధనాధన్ ఫార్మట్ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి.. తాజాగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ లో అలాంటి మ్యాజిక్ జరిగింది. ఈ మ్యాచులో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియెన్‌ అలెన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్‌ బ్యాటింగ్‌ సమయంలో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ను హెడెన్‌ వాల్ష్‌ వేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన ఫించ్‌.. ఓవర్‌ రెండో బంతిని లాంగాన్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. ఫాబియెన్‌ అలెన్‌ కొన్ని గజాల దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి డైవ్‌ చేస్తూ ఎడమ చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అంతే ఫించ్‌ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబందించిన వీడియో ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనికి ముందు కూడా అలెన్‌ మూడో టీ20లోనూ ఇలాంటి ఫీట్‌ను నమోదు చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఐసీసీ అలెన్‌ పట్టిన కొన్ని అద్భుత క్యాచ్‌లను వీడియో రూపంలో షేర్‌ చేసింది. అలెన్ ఫీట్లను చూస్తే వావ్ అనాల్సిందే. అలెన్ ఫీల్డింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏంటయ్యా అలెన్ సూపర్ మ్యాన్ అన్నలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  ఇక, ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇటీవలి కాలంలో టెస్ట్, వన్డేల్లో మోస్తరు ప్రదర్శనకే పరిమితమైన విండీస్.. టీ20ల్లో మాత్రం తాము ప్రపంచ ఛాంపియన్ అని నిరూపించుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన విండీస్ పొట్టి సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. పటిష్ట ఆస్ట్రేలియా విండీస్ ముందు పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటాలనుకున్నా ఫించ్ సేనకు టీ20 ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ ఓ పీడకలగా మారింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విండీస్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ (12) విఫలమయినా.. మరో ఓపెనర్ ఎవిన్​ లూయిస్‌ (79, 34 బంతులు; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లూయిస్‌ సిక్సులు వర్షం కురిపించాడు. ఏకంగా 9 సిక్సులు బాదాడు. ఆపై నికోలస్ పూరన్‌ (31), క్రిస్ గేల్‌ (21), లెండిల్ సిమన్స్‌ (21) కూడా ధాటిగా ఆడడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది.

  ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి.. 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. జోష్ ఫిలిప్ డకౌట్ అయ్యాడు.అయితే కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ (34), మిచెల్‌ మార్ష్‌ (30) జట్టును ఆదుకున్నారు. మార్ష్‌ ఔట్ అయినా.. మొయిసెస్ హెన్రిక్స్ (21) సాయంతో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఫించ్ ముందుకు నడిపాడు. కొద్ది వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో ఆసీస్ మ్యాచుపై ఆశలు వదిలేసుకుంది. మాథ్యూ వెడ్ (26) కాసేపు అలరించాడు. విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మంగళవారం ప్రారంభం కానుంది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, Cricket, Sports, Viral Video, West Indies

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు