వెస్టిండీస్ క్రికెట్లో (West Indies Cricket) అతడో మంచి ఆల్‌రౌండర్ (All Rounder). ఆల్ రౌండర్ అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగే కాదు. పాటలు పాడతాడు.. డ్యాన్సులు వేస్తాడు.. నవ్విస్తాడు.. ఎంటర్టైన్ చేస్తాడు. ఎవరి గురించి చెబుతున్నామో.. ఇప్పటికే మీకు అర్దమైపోయి ఉంటుంది. అవును.. అతనే డ్వేన్ బ్రావో (Dwayne Bravo). టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డులు కలిగిన ఈ వెటరన్ క్రికెటర్ కరేబియన్ గడ్డపై (Caribbean Soil) బుధవారం (అగస్టు 4) తన చివరి అంతర్జాతయ క్రికెట్ మ్యాచ్ (Last International Match) ఆడనున్నాడు. గయానాలో పాకిస్తాన్‌తో జరుగనున్న మ్యాచ్ అతడికి సొంత గడ్డపై చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రకటించాడు. ఇప్పటికే ఈ విషయాన్ని సహచరులతో షేర్ చేసిన బ్రావో.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రికెట్ వెస్టిండీస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ఒక వీడియో క్లిప్‌లో డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ గురించి ప్రకటించాడు. 'మా జట్టులోని ధైర్యవంతుల్లో ఒకరి గురించి చెప్పే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. డ్వేన్ బ్రావో కరేబియన్ గడ్డపై తన చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ బుధవారం ఆడబోతున్నాడు. ఇప్పటికే వన్డే, టెస్టుల నుంచి చానాళ్ల క్రితమే అతడు రిటైర్ అయ్యాడు. ఇకపై మనం ఆయనను అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతూ కరేబియన్‌లో చూడలేము. అతడికి అభినందనలు' అని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.
కాగా, త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ తరపున డ్వేన్ బ్రావో ఆడనున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేస్తాడు. వెస్టిండీస్ జట్టులో మంచి ఆల్‌రౌండర్‌గా డ్వేన్ బ్రావో రికార్డులు ఉన్నాయి. తన టీ20 కెరీర్లో రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచాడు. 2012లో తన పుట్టిన రోజు నాడే శ్రీలంకలో టీ20 వరల్డ్ కప్ గెలిచాడు. ఆ తర్వాత 2016లో ఇంగ్లాండ్‌పై కోల్‌కతాతో మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి క్రికెట్లో గొప్ప రికార్డులు ఉన్న అతికొద్ది మంది క్రికెటర్లలో బ్రావో ఒకడు. ముఖ్యంగా డెత్ వోవర్లలో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించే బౌలర్లో బ్రేవో టాప్5లో ఉంటాడు. వెస్టిండీస్ తరపున 85 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. మొత్తం 76 వికెట్లు తీశాడు. గత నెలలో దక్షిణాఫ్రికాతో గ్రెనెడా నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అతడి కెరీర్లో అదే అత్యుత్తమ ప్రదర్శన. వెస్టిండీస్ గడ్డపై డ్వేన్ బ్రావో 15 టెస్టులు, 93 వన్డేలు, 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా.. మొత్తంగా 40 టెస్టులు, 164 వన్డేలు, 85 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2200 పరుగులు చేసి 86 వికెట్లు తీశాడు. వన్డేల్లో 2968 పరుగులు, 199 వికెట్లు టీ20ల్లో 1229 పరుగులు 76 వికెట్లు తీశాడు.
This is what the Skipper had to say at the start of the match ?⬇️
And yes it's official, today's T20I is the last in the Caribbean for the Champion @DJBravo47 ?#WIvPAK #MissionMaroon pic.twitter.com/0CJZ9oX1SN
— Windies Cricket (@windiescricket) August 3, 2021
An entertaining T20I spell in the Caribbean comes to an end ?
Thanks to the Champion @DJBravo47 for his leadership and stellar contribution to the #MenInMaroon ? pic.twitter.com/PuIltZ5l13
— Windies Cricket (@windiescricket) August 3, 2021
డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా లీగ్స్‌లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లలో ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున, సీపీఎల్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పాట్రియట్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, West Indies