వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఘోర పరాజయం పాలైన టీమిండియా పరువు కాపాడుకునే పనిలో పడింది. అచ్చొచ్చిన విశాఖపట్నం వేదికగా రెండో వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మొత్తం మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో టీమిండియా ఓడితే సిరీస్‌ను కోల్పోతుంది. అందుకే.. ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. కాగా, కాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్టులో శివం దుబే స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను కోహ్లీ జట్టులోకి తీసుకున్నాడు.
Published by:Shravan Kumar Bommakanti
First published:December 18, 2019, 13:21 IST