Home /News /sports /

WEST INDIES CRICKETER FABIAN ALLEN TAKES ABSOLUTE BLINDER VIDEO GOES VIRAL SRD

Viral Video : వాటే క్యాచ్..వాటే క్యాచ్.. కళ్లు మూసి తెరిచేలోపు పట్టేసుకున్నాడుగా...

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral Video : అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసమే శ్రీలంక, వెస్టిండీస్ ల మధ్య జరిగిన మూడో టీ-20లో చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
    అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అలాంటి విన్యాసమే శ్రీలంక, వెస్టిండీస్ ల మధ్య జరిగిన మూడో టీ-20లో చోటు చేసుకుంది. శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో వెస్టిండీస్‌ గెలుపొందింది. మూడు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక సోమవారం నాటి ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలెన్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. లంక బ్యాట్స్‌మన్‌ గుణతిలకకు బౌలింగ్‌ చేసిన అలెన్‌, స్టన్నింగ్‌ రిటర్న్‌ క్యాచ్‌తో అతడిని పెవిలియన్‌కు చేర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వెస్టిండీస్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.
    " కళ్లు మూసి తెరిచేలోపు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఫాబియన్‌ అలెన్‌ అద్భుతమే చేశాడు. మాస్టర్‌కార్డ్‌ మూమెంట్‌. దీనిని వర్ణించేందుకు మాటలు సరిపోవు" అంటూ హర్షం వ్యక్తం చేసింది.

    ఇక, మొదటి టీ20ని విండిస్‌ గెలవగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఇక సోమవారం నాటి ఆఖరి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పర్యాటక జట్టు.. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. చండిమాల్‌(54), ఆషన్‌ బండారా(44) రాణించగా, మ్యాథ్యూస్‌(11) ఫరవాలేదనిపించాడు. మిగిలిన ఆటగాళ్లు సింగిల్‌డిజిట్‌కే పరిమితం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. విండీస్‌ ఆటగాళ్లు ఫాబియన్‌ అలెన్‌, కెవిన్‌, హోల్డర్‌, ఒబెడ్‌ మెకాయ్‌కు చెరో వికెట్‌ దక్కింది.


    స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న ఫాబియన్ అలెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక అలెన్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-1 తేడాతో విండీస్‌ కైవసమైంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Viral Video, West Indies

    తదుపరి వార్తలు