WEST INDIES BATSMAN SAMUELS RETIRES FROM ALL FORMS OF CRICKET SK
Marlon Samuels: క్రికెట్‌కు మరో ఆటగాడు గుడ్‌బై.. అన్ని ఫార్మట్ల నుంచీ రిటైర్మెంట్
మర్లోన్ శామ్యూల్స్
Marlon Samuels: 2000లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన మర్లోన్ శామ్యూల్స్.. వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
క్రికెట్‌కు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ మర్లోన్ శామ్యూల్స్ గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రిటైర్మెంట్ గురించి జూన్‌లోనే సమాచారం అందించాడని క్రికెట్ వెస్టిండీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించాడు. వెస్టిండీప్ తరపున 2018లో బంగ్లాదేశ్‌పై చివరి మ్యాచ్ ఆడాడు శామ్యూల్స్. 39 ఏళ్ల ఈ జమైన్ క్రికెటర్.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 71 టెస్ట్‌లు, 207 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మట్లలో కలిపి 11వేల పరుగులు చేశాడు. 150కి పైగా వికెట్లు తీసుకున్నాడు.
2012, 2016లో వెస్టిండీస్ జట్టు టీ20 వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు టోర్నీల్లో జట్టు విజయానికి శామ్యూల్స్ కీలక పాత్ర పోషించాడు. 2012లో కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో.. శ్రీలంక జట్టుపై 56 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 2016లో కోల్‌కతలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో.. ఇంగ్లండ్ జట్టుపై 66 బంతుల్లో 85 రన్స్ చేసి.. వెస్టిండీస్‌ను గెలిపించాడు. ఇలా ఎన్నో సార్లు కీలక ఇన్సింగ్స్ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందించాడు శామ్యూల్స్.
2000లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన మర్లోన్ శామ్యూల్స్.. వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, పుణె వారియర్స్ తరపున ఆడాడు. అంతేకాదు మెల్బోర్న రెనిగేడ్స్, పెషావర్ జల్మీ తరపునా ప్రాతనిధ్యం వహించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన శ్యామ్సూల్స్.. పలు కాంట్రవర్సీలతోనూ వార్తల్లో నిలిచాడు.
ఇటీవల రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బెన్ స్టోక్స్‌పై నీచమైన వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు శామ్యూల్స్. క్వారంటైన్లో ఉండడం చాలా కష్టమని..ఇలాంటి ఇబ్బందులు పగవాడికి కూడా రావొద్దని కొన్ని రోజుల క్రితం స్టోక్స్ అన్నాడు. చివరకు తన బద్ధ శత్రువైన శామ్యూల్స్‌కు కూడా రావొద్దని సరదాగా వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై మండిపడిన శామ్యూల్స్.. నీ భార్యను 14 రోజులు పంపించు అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యవహారంలో శామ్యూల్స్‌ను ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్‌తో పాటు పలువురు క్రికెటర్లు తప్పుబట్టారు. ఐతే మరోసారి రెచ్చిపోయిన శామ్యూల్స్...షేన్వార్న్నూ వదిలిపెట్టలేదు. ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నువ్వా.. నాకు నీతులు చెప్పేది అంటూ విరుచుకుపడ్డాడు. శామ్యూల్స్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలోనే.. అతడి రిటైర్మెంట్ వార్త బయటకు వచ్చింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.