హోమ్ /వార్తలు /క్రీడలు /

Andre Russell : రస్సెలా మజాకా.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన కేకేఆర్ వీరుడు.. వీడియో వైరల్

Andre Russell : రస్సెలా మజాకా.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన కేకేఆర్ వీరుడు.. వీడియో వైరల్

PC : TWITTER

PC : TWITTER

Andre Russell : వెస్టిండీస్ (West Indies) విధ్వంసక ఆల్ రౌండర్.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కరీబియన్ దీవుల్లో జరుగతోన్న సిక్స్ టీ (6ixty) పురుషుల క్రికెట్ టోర్నమెంట్ లో ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Andre Russell : వెస్టిండీస్ (West Indies) విధ్వంసక ఆల్ రౌండర్.. కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కరీబియన్ దీవుల్లో జరుగతోన్న సిక్స్ టీ (6ixty) పురుషుల క్రికెట్ టోర్నమెంట్ లో ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 10 ఓవర్ల చొప్పున సాగే ఈ మ్యాచ్ లో రస్సెల్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ టోర్నీలో రస్సెల్ షారుఖ్ ఖాన్ టీం అయిన ట్రిన్ బాగో నైట్ రైడర్స్ (Trinbago knight roders)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు ప్రదర్శనను రస్సెల్ సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ (st kitts and nevis patriots)పై నమోదు చేశాడు.


ఇది కూడా చదవండి : కెప్టెన్ గా వచ్చింది నిన్నే.. కానీ అప్పుడే కోహ్లీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ.. ఏంటంటే?


అయితే రస్సెల్ ఈ సిక్సర్ల ప్రదర్శనను రెండు ఓవర్లలో పూర్తి చేశాడు. పేట్రియాట్స్ బౌలర్ డ్రేక్స్ వేసిన 7వ ఓవర్ చివరి నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాదిన రస్సెల్.. ఆ తర్వాతి ఓవర్ తొలి రెండు బంతులకు మరో రెండు సిక్సర్లు బాదాడు అంతేకాకుండా ఆ తర్వాతి బంతిని ఫోర్ కొట్టాడు. అంటే రస్సెల్ వరుసగా 6, 6, 6, 6, 6, 6, 4తో కేవలం 7 బంతుల్లో 40 పరుగులు పిండికున్నాడు. అదేంటి ఓవర్ పూర్తయ్యాక బ్యాటింగ్ ఎండ్స్ మారుతాయి కదా అనుకుంటున్నారా? అయితే సిక్స్ టీ టోర్నీలో కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ఓవర్ ఓవర్ కు బ్యాటింగ్, బౌలింగ్ ఎండ్స్ మారవు. ఒక ఎండ్ నుంచి వరుసగా 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తారు. అనంతరం మరో ఎండ్ నుంచి మిగిలిన ఓవర్లను బౌలింగ్ చేస్తారు. దాాంతో రస్సెల్ ఓవర్ మారినా స్ట్రయికింగ్ లోనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరూ చూసేయండి మరీ..





ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్ బాగో జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. రస్సెల్ 24 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఇందులో 8 భారీ సిక్సర్లతో పాటు మరో 5 ఫోర్లు ఉన్నాయి. అనంతరం పేట్రియాట్స్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. దాంతో ట్రిన్ బాగో 3 పరుగుల తేడాతో గెలిచింది. రూథర్ ఫోర్డ్ (15 బంతుల్లో 50; 1 ఫోర్, 7 సిక్సర్లు), డొమినిక్ డ్రేక్స్ (10 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడారు.

First published:

Tags: Andre Russell, Chris gayle, IND vs PAK, India VS Pakistan, Kieron pollard, Kolkata Knight Riders, Rohit sharma, Shahrukh khan, Virat kohli, West Indies

ఉత్తమ కథలు