HOME » NEWS » sports » WELL WHACK THE AUSSIES KEVIN PIETERSEN PREDICTS WORLD CUP 2019 FINALISTS SB

ICC World Cup 2019: ఫైనల్‌కు చేరేవి ఆ రెండు జట్లే... మాజీ కెఫ్టెన్ జోస్యం

బాస్టన్‌లో జరగనున్న రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ హోరా హోరీగా ఢీకొననున్నాయి. ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా ఏయే టీమ్స్ ఫైనల్స్‌కు చేరుకుంటాయోనని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

news18-telugu
Updated: July 8, 2019, 4:03 PM IST
ICC World Cup 2019: ఫైనల్‌కు చేరేవి ఆ రెండు జట్లే... మాజీ కెఫ్టెన్ జోస్యం
(Image : Twitter)
  • Share this:
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2019 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ నాలుగు జట్లు లీగ్ స్థాయిన దాటి నాకౌట్ దశకు వచ్చేశాయి. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ జట్లు సెమీస్‌ చేరుకున్నాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మంగళవారం జరగనున్న తొలి సెమీస్‌లో ఇండియా వర్సోెస్ న్యూజిలాండ్ టీంలు తలపడనున్నాయి. ఇక గురువారం ఎడ్జ్ బాస్టన్‌లో జరగనున్న రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ హోరా హోరీగా ఢీకొననున్నాయి. ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా ఏయే టీమ్స్ ఫైనల్స్‌కు చేరుకుంటాయోనని ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మాజీ కెఫ్టెన్ ఫైనల్స్ కు ఏయే జట్లు చేరబోతున్నాయో చెప్పేశాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫైనల్‌కు చేరే జట్లు ఏమనేవి జోస్యం చెప్పాడు.

సెకండ్ సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని పీటర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం లండన్ లో జరిగే ఫైనల్స్ లో ఇండియా, ఇంగ్లండ్ లు తలపడతాయని జోస్యం చెప్పాడు. రేపటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఇండియా ఇంటికి పంపిస్తుందని పీటర్సన్ చెప్పకనే చెప్పాడు. ఇక ఆర్వాత జరిగే ఇండియాను ఓడించే జట్టు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని ట్వీట్ చేశాడు.


Published by: Sulthana Begum Shaik
First published: July 8, 2019, 3:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading