హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India: టోక్యో ఒలింపిక్స్‌లో చిత్రవిచిత్రమైన నిబంధనలు.. అథ్లెట్లు అలా చేస్తే అనర్హులే..

Team India: టోక్యో ఒలింపిక్స్‌లో చిత్రవిచిత్రమైన నిబంధనలు.. అథ్లెట్లు అలా చేస్తే అనర్హులే..

ఒలింపిక్స్‌లో చిత్రవిచిత్రమైన నిబందనలు చూస్తారా? (Olympics)

ఒలింపిక్స్‌లో చిత్రవిచిత్రమైన నిబందనలు చూస్తారా? (Olympics)

టోక్యో ఒలింపిక్స్‌లో అందరూ కరోనా నిబంధనలు పాటించాలనే విషయం తెలిసిందే. అయితే మీకు తెలియని కొన్ని విచిత్రమైన రూల్స్ ఉన్నాయి. అవి అథ్లెట్లు తప్పని సరిగా పాటించాలి. లేకపోతే పాయింట్లలో కోత లేదంటే అనర్హులుగా పరిగణించబడతారు.

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన విశ్వ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభం కావడంతో అథ్లెట్లతో పాటు క్రీడాభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్‌తో పాటు ఆర్చరీ ఈవెంట్లు ప్రారంభమయ్యాయి. ఇక టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా క్రీడాకారులు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు తప్పకుండా కరోనా నిబంధనలు (Rules) పాటించాలని నిర్వాహక కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా ఆయా గేమ్స్‌లో కొన్ని విచిత్రమైన నిబంధనలు కూడా ఉన్నాయి. ఇవి గతం నుంచే అమలులో ఉన్నాయి. కేవలం ఒలింపిక్స్‌లోనే కాకుండా ఆ ఆటలు ఎక్కడ ఆడినా సదరు నిబందనలు పాటించాల్సిందే. అయితే ఈ విచిత్రమైన నిబంధనలు మాత్రం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పురుష బాక్సర్లకు మొదటి నుంచి ఒక నిబంధన అమలులో ఉన్నది. వాళ్లు ఏ విభాగంలో పోటీ పడుతున్నా క్లీన్ షేవ్‌తోనే కనపడాలి. అలా కనపడటం మాకు నచ్చదు అనుకుంటే పెన్సిల్ కట్ మీసాలు మాత్రం ఉంచుకోవడానికి అనుమతి ఇస్తారు. ఇలాంటి విచిత్రమైన నిబంధనలు ఇతర ఆటల్లో కూడా ఉన్నాయి. అవేంటో ఒక సారి గమనిద్దాం.


  • రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే మహిళ, పురుష ఆటగాళ్లు తప్పని సరిగా తమ వెంట ఒక కర్చీప్ ఉంచుకోవాలి. దీన్ని 'బ్లడ్రాగ్' అని పిలుస్తుంటారు. ఆట ఆడే సమయంలో గాయాలు తగిలి రక్తం కారుతుంటే ఈ కర్చీప్ తోనే తుడుచుకోవాలి. అందుకే దీన్ని బ్లడ్రాగ్ అంటుంటారు.

  • వాటర్ పోలో గేమ్‌ ఆట మొదలవడానికి ముందు ఆటగాళ్ల చేతి, కాలి వేలి గోర్లు పరీక్షిస్తారు. ఎవరి గోర్లు అయినా పొడవుగా ఉంటే అక్కడికక్కడే కత్తరించేస్తారు. ఆటాడే సమయంలో అనసవరమైన గాయాు అవకుండా ఉండటానికే నిర్వాహకులు ఈ నిబందన పెట్టారు.

  • జిమ్నాస్ట్స్‌కు కూడా చేతి వేళ్ల గోర్లకు సంబంధించిన ఒక నిబందన ఉన్నది. మహిళా జిమ్నాస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ వేళ్లకు రంగురంగుల పాలిష్‌లు వేసుకోరాదు. మొఖానికి ఎంత మేకప్ అయినా వేసుకునే అవకాశం ఉన్నా నెయిల్ పాలిష్ విషయంలోనే ఆంక్షలు ఉన్నాయి.

  • స్కేటింగ్స్‌లో మగ ఫిగర్ స్కేటర్లు కేవలం ట్రౌజర్లు మాత్రమే ధరించాలి. మహిళా స్కేటర్లు కేవలం స్కర్టులే వేసుకోవాలి.

  • బీచ్ వాలీబాల్‌లో తప్పని సరిగా బికినీలు ధరించాల్సి ఉంటుంది. 7 సెంటీమీటర్లకు మించని పరిమాణంలో బికినీ ఉండాలి. అలాగే నచ్చిన రంగులో బికినీలు ధరించవచ్చు. కానీ ఇరు జట్లు ఒకే రంగు ఇష్టపడితే మాత్రం టాస్ వేసి రంగు డిసైడ్ చేస్తారు.

  • ఈక్వెస్ట్రియన్ క్రీడలో పోటీ ముగిసేంత వరకు ఆటగాడు నోరు తెరవకూడదు. గుర్రాన్ని కనీసం అదిలించడం కూడా కుదరదు. అలా అదిలిస్తే మాత్రం పోటీలో చివరి స్థానం ఇస్తారు.

  • ఎవరైనా స్విమ్మర్ వరల్డ్ రికార్డు సృష్టిస్తే ఆటోమెటిగ్గా రికార్డు నమోదు కాదు. ఆ అథ్లెట్ తన రికార్డును ఫ్యాక్స్ చేస్తే గాని రికార్డు నమోదు కాదు.

  • క్రీడా మైదానాల్లో గానీ, కోర్టులు, బౌట్‌, స్విమ్మింగ్స్ పూల్స్ వద్ద జడ్జీలపై నిరసన దిగడం, ధర్నాలు చేయడం నిషేధం. క్రీడా గ్రామంలో కూడా ఎక్కడా ఇలాంటి ప్రదర్శనలు చేయడం కుదరదు.

  • డైవింగ్ పోటీల సమయంలో డైవర్లు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపించాలి. ఏ మాత్రం భయపడినట్లు కనపడినా రెండున్నర పాయింట్ల కోత పెడతారు.

First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు