హోమ్ /వార్తలు /క్రీడలు /

We Want A New Captain : కోహ్లీ నీ టైం దగ్గర పడింది..కెప్టెన్సీ నుంచి తప్పుకో..

We Want A New Captain : కోహ్లీ నీ టైం దగ్గర పడింది..కెప్టెన్సీ నుంచి తప్పుకో..

We Want A New Captain : అసలు కోహ్లీనే ఓ అన్‌లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరాలేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు.

  ఎన్నో అంచనాల నడుమ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final) తలపడిన భారత్ కు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... అద్భుత ఆటతీరుతో మెగా టోర్నీని సొంతం చేసుకుంది విలియమ్సన్ సేన. అయితే, ఈ మెగా ఫైనల్లో భారత జట్టు చేజాతులారా ఓటమిపాలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసి రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ చెత్త కెప్టెన్సీ వల్ల కనీసం డ్రా చేసుకునే మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోయిందని మండిపడుతున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  అలాగే టీమిండియా ఘోర ప్రదర్శనకు హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మరో ప్రధాన కారణమని అభిమానులు భావిస్తున్నారు. దీంతో కోహ్లీతో పాటు కోచ్‌ రవిశాస్త్రిపై కూడా వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ఓ అన్‌ లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరావడం లేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమిస్తే కనీసం టీ20 ప్రపంచకప్ అయినా గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ మీడియాలో WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అలాగే కోచ్‌ రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  అసలు కోహ్లీనే ఓ అన్‌లక్కీ కెప్టెన్ అని, టాస్ నుంచి వాతావరణ పరిస్థితుల వరకు ఏదీ అతనికి కలిసిరాలేదంటున్నారు. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. ఫైనల్లో ఓడిపోవడం అలవాటు అయిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు లిమిటెట్ క్రికెట్ లో రోహిత్ కు బాధ్యతలు అప్పజెప్పి..టెస్ట్ క్రికెట్ లో రహానే కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

  First published:

  Tags: India vs newzealand, Rahul dravid, Ravi Shastri, Rohit sharma, Virat kohli, WTC Final

  ఉత్తమ కథలు