ఎంఎస్ ధోనీని టెర్రరిస్ట్ అంటున్న బీహారీ... ఎందుకంటే...

ఎంఎస్ ధోనీ (Image : Twitter)

World Cup - MS Dhoni : ఉగ్రవాదులు ఎలాగైతే ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరుపుతారో... ధోనీ కూడా ఇష్టమొచ్చినట్లు బంతిని బాదేసేవాడట.

  • Share this:
ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని జార్ఖండ్ డైనమైట్ అనీ, మిస్టర్ కూల్ అనీ, ధనాధన్ ధోనీ అనీ ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. కొత్తగా ఈ టెర్రరిస్ట్ అనే పదం ఎందుకొచ్చిందో తెలుసుకుందాం. ధోనీ టీంఇండియాతో ఎంత కూల్‌గా ఉంటాడో, తన ఫ్రెండ్స్‌తో కూడా అంతే సరదాగా ఉంటాడు. 2000 సంవత్సరంలో ధోనీ బీహార్ తరపున క్రికెట్ ఆడేవాడు. అప్పట్లో బీహార్ టీమ్ మేట్ సత్య ప్రకాష్... ఈ కెప్టెన్ కూల్‌తో జాన్ జిగినీ దోస్త్‌లా ఉండేవాడు. ఆ క్లోజ్‌నెస్ కొద్దీ టీమ్ సభ్యులు ధోనీని టెర్రరిస్ట్ (ఉగ్రవాది) అని పిలిచేవాళ్లట. ఎందుకంటే ధోనీ క్రీజ్‌లోకి ఎంటరైతే... బంతులు బౌండరీలు దాటేవట. జస్ట్ 20 బాల్స్‌లో 40-50 రన్స్ కొట్టేసేవాడట. ఉగ్రవాదులు ఎలాగైతే ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరుపుతారో... ధోనీ కూడా ఇష్టమొచ్చినట్లు బంతిని బాదేసేవాడట. కానీ తను టీంఇండియాలో చేరాక... సన్యాసిలా మారిపోయాడనీ, తన వైఖరి మార్చుకొని... చాలా పద్ధతైన క్రికెటర్ అయిపోయాడని అంటున్నారు సత్య ప్రకాష్.

MS ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమాలో ఈ సత్య ప్రకాష్ కేరక్టర్ ఉంటుంది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ధోనీకి జాబ్ ఇప్పించే సీన్ ఉంటుంది. బీహార్ తరపున క్రికెట్ ఆడే సమయంలో ధోనీ అతి అరుదుగా కెప్టెన్సీ చేసేవాడట. హిందీ మాత్రమే మాట్లాడేవాడట. అలాంటిది టీంఇండియాలోకి వచ్చాక, కెప్టెన్సీతోపాటూ... ఇంగ్లీష్ కూడా ఫ్లూయంట్‌గా మాట్లాడటం కూడా బాగా డెవలప్ చేసుకున్నాడని తెలిపాడు. తనలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని గుర్తించలేకపోయామంటున్నాడు సత్య ప్రకాష్. ప్రస్తుతం ఆయన ఖరగ్‌పూర్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు.

ఐపీఎల్ 12వ టోర్నీలో ధోనీ అంచనాలకు మించి ఆడాడన్న సత్య ప్రకాష్... నెక్ట్స్ ఐపీఎల్‌లో కూడా ధోనీ ఆడతాడని అంటున్నాడు. ధోనీ పనైపోయిందన్న విమర్శకలకు మిస్టర్ కూల్ బ్యాటింగ్‌తోనే సమాధానం చెబుతున్నాడని మెచ్చుకున్నాడు.

 

ఇవి కూడా చదవండి :

బిడ్డకు జన్మనిచ్చిన యువతి... తను గర్భవతి అనే తెలియదట...

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...

లగడపాటి సర్వే సిద్ధం... ఎగ్జిట్‌ పోల్స్ ఏం చెప్పినా...

Bigg Boss 13 : బిగ్ బాస్ 13లో పసుపు చీర పోలింగ్ అధికారి..?
First published: