పాకిస్థాన్‌తో టీంఇండియా ఆడాలా వద్దా... బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టిన బీసీసీఐ

Pulwama Attack Update : పుల్వామా ఉగ్ర దాడిని ఖండించిన భారత ప్రజలు... పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లు రద్దు చెయ్యాలని కోరుతున్నారు. దీనిపై ఎటూ తేల్చని బీసీబీఐ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టింది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 20, 2019, 11:49 AM IST
పాకిస్థాన్‌తో టీంఇండియా ఆడాలా వద్దా... బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టిన బీసీసీఐ
బీసీసీఐ హెడ్ క్వార్టర్ (File)
  • Share this:
ఐసీసీ ప్రపంచ కప్ మేలో జరగబోతోంది. అందులో ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ కొన్ని మ్యాచ్‌లు ఆడక తప్పని పరిస్థితి. ఐతే, పుల్వామా ఉగ్ర దాడితోపాటూ... వరుసగా ఆ దేశం సరిహద్దుల్లో జరుపుతున్న కాల్పుల్ని నిరసిస్తూ... పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చెయ్యాలని దేశ ప్రజలతోపాటూ... బీసీసీఐలో మాజీ సభ్యులు, కొందరు వెటరన్ క్రీడాకారులు కూడా కోరుతున్నారు. ఐతే, దీనిపై అటు బీసీబీఐ గానీ ఇటు కేంద్రంగానీ వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేదు. వరుస ఒత్తిళ్ల మధ్య బీసీసీఐ పెద్దలు నోరు విప్పారు. ప్రపంచ కప్‌ నాటికి భారత ప్రభుత్వం పాక్‌తో ఆడకూడదని నిర్ణయిస్తే తాము దానిని పాటిస్తామని తెలిపారు. ఒకవేళ ఇండియా మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే అది పాకిస్థాన్‌కి కలిసొస్తుందనీ, మ్యాచ్ ఆడకుండానే ఆ జట్టు పాయింట్లు పొందుతుందనీ స్పష్టం చేసింది. అదే విధంగా ఇండియా పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి వస్తే, ఆ సమయంలో ఇండియా మ్యాచ్ రద్దు చేసుకుంటే... మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్ ప్రపంచ కప్ గెలిచినట్లవుతుందని క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఐసీసీతో ఇంకా చర్చించలేదని తెలిపింది.

ప్రపంచ కప్ జరగడానికి ఇంకా మూడు నెలల టైం ఉంది. ఈలోపు రెండు దేశాల మధ్యా ఉద్రిక్తతలు తగ్గితే, మ్యాచ్ జరిగే అవకాశాలుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది బీసీసీఐ. ప్రపంచ కప్ జరిగే సమయానికి క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోకి వెళ్లినట్లైంది. మరి కేంద్రం ఆటలకూ ఉగ్ర దాడులకూ సంబంధం లేదంటుందో, పాకిస్థాన్‌తో ఆడే ప్రసక్తే లేదంటుందో త్వరలోనే తేలే అవకాశాలున్నాయి.

 

ఇవి కూడా చదవండి :
పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీలో పెట్రోల్ అమ్మకాలకు షార్ట్ బ్రేక్...


రూ.5 లక్షలిస్తా... ప్రమోషన్ కోసం లంచం ఆఫర్... సస్పెండ్ అయిన ఉద్యోగి


ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...

 
First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు